ఖమ్మం

ఆదర్శ పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం రూరల్, మే 15: పాలేరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఆదర్శ పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు భేష్‌గా ఉన్నట్టు ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ రుడాల్ సంతృప్తిని వ్యక్తం చేశారు. మండలంలోని తల్లంపాడు జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని అధికారులు అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. పోలింగ్ కేంద్రాన్ని షామియానాలు, కుర్చీలు, రెడ్ కార్పెట్లు, ఓటుహక్కు, దాని విలువ, ఓటుతో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం వంటి సూక్తులతో కూడిన బ్యానర్లు, పోలింగ్ బూత్‌లలో కూలర్లు, ఎవరైనా అనారోగ్యానికి గురైతే వెంటనే ప్రధమ చికిత్స చేసేందుకు ప్రత్యేక వైద్యశిబిరాలు, దివ్యాంగుల కోసం ప్రత్యేక వీల్ చైర్లు, భగభగ మండే ఎండల నుంచి రక్షణ, సేదదీరేందుకు అవసరమైన విశ్రాంతి గదులు, మంచినీటి సౌకర్యాలు, అధికారుల కోసం ప్రత్యేక గదులు, మరుగుదొడ్లు తదితర వౌలిక సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ రుడాల్ జిల్లా కలెక్టర్ దానకిశోర్, వరంగల్ డిఐజి మల్లారెడ్డి, జిల్లా ఎస్పీ రాజేశ్వరి, ఎన్నికల అబ్జర్వర్ పళనిస్వామిలతో కలిసి తల్లంపాడు ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదర్శ పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సౌకర్యాల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. దీనివల్ల ఓటింగ్ శాతం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ దానకిశోర్ మాట్లాడుతూ ఓటర్లు తమ ఓటుహక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని సూచించారు. డబ్బు, మధ్యం వంటి ప్రలోభాలకు లోనుకాకుండా తమ ఓటు వేసి మంచి నాయకున్ని ఎన్నుకోవాలని సూచించారు. నియోజకవర్గంలోని 283 పోలింగ్ కేంద్రాలలో వెబ్‌కాస్టింగ్, వీడియో రికార్డింగ్‌లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో మైక్రో అబ్జర్వర్‌ను నియమించామని, నియోజకవర్గం వ్యాప్తంగా 42 ఫ్లైయింగ్ స్క్వాడ్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ ప్రారంభ సమయంలో ఒక్కొక్క బూత్‌లో మొదటి పదిమంది ఓటర్లను గులాబి పువ్వులు ఇచ్చి ఓటింగ్ వేసేందుకు ఆహ్వానం పలకనున్నట్టు వెల్లడించారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద మంచినీరు, కూలర్లు, మజ్జిగ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. ఇవిఎంల ద్వారా ఓటింగ్ వేసే విధానంపై ఇప్పటికే గ్రామాలలో అవగాహనా సదస్సులు, కళాజాతాల ద్వారా ప్రదర్శనలు నిర్వహించినట్టు వివరించారు. జిల్లా ఎస్‌పి రాజేశ్వరి మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మక గ్రామాలలో మరింత బందోబస్తు ఏర్పాటు చేసినట్టు వివరించారు. సుమారు ఆరు కంపెనీలకు చెందిన పారా మిలటరీ దళాలు బందోబస్తులో పాల్గొంటున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో సిఇఓ, ట్రైనీ కలెక్టర్ ముషారఫ్ అలీ పాల్గొన్నారు.