ఖమ్మం

ఇవిఎంలతో తరలిన పోలింగ్ సిబ్బంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(మామిళ్ళగూడెం), మే 15: పాలేరు ఉప ఎన్నిక సోమవారం జరగనుండగా ఆదివారం సాయంత్రమే పోలింగ్ సిబ్బంది ఇవిఎంలతో పోలింగ్ బూత్‌లకు చేరుకున్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో పోలింగ్ సిబ్బందికి ఇవిఎంలను అందించి ప్రత్యేక వాహనాల ద్వారా బూత్‌లకు తరలించారు. ఒక్కొ పోలింగ్ బూత్‌లో ఒక పివో, ఒక ఎపివోతో పాటు ముగ్గురు పోలింగ్ సిబ్బంది, వెబ్‌కాస్టింగ్ సిబ్బంది ఒకరు ఉండనున్నారు. నియోజకవర్గ పరిధిలోని 243 పోలింగ్ బూత్‌లను 25 రూట్‌లుగా విభజించి జోనల్, రూట్ అధికారుల పర్యవేక్షణలో పోలీసుల బందోబస్తు నడుమ ప్రత్యేక వాహనాల్లో ఇవిఎంలను, సిబ్బందిని తరలించారు. పోలింగ్ బూత్‌ల వద్ద పోలింగ్ సిబ్బందికి, ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఆదివారం ఉదయం నుంచే మార్కెట్‌యార్డుకు చేరుకున్న పోలింగ్ అధికారులు తమకు కేటాయించిన కేంద్రంలో ఇవిఎంలను తీసుకొని ఇతర సిబ్బందితో కలిసి పోలింగ్ బూత్‌లకు వెళ్ళారు. కాగా ఆయా గ్రామాల్లో విస్తృత పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అయిన వెంటనే ఇవిఎంలను ఏజెంట్ల ఎదుట పరీక్షించి పోలింగ్ జరపనున్నారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ శాతాన్ని గతం కంటే పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టిన అధికారులు పోలింగ్ రోజు ఓటర్లంతా పోలింగ్ కేంద్రానికి వచ్చేలా క్షేత్రస్థాయి అధికారుల సహకారంతో ఏర్పాట్లు చేస్తున్నారు.