ఖమ్మం

కెటిపిఎస్‌లో కార్మికుడి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాల్వంచ, మే 16: పాల్వంచలోని కెటిపిఎస్ కర్మాగారంలో సిఎల్‌గా పనిచేస్తున్న ఒక కార్మికుడు మృతిచెందిన సంఘటన సోమవారం జరిగింది. వివరాలిలావున్నాయి. శ్రీకాకుళం జిల్లా ముచ్చంద్ర గ్రామానికి చెందిన పిట్టా మోహన్ (32) కూలిపని నిమిత్తం కెటిపిఎస్ 7వ దశ కర్మాగారంలోని ఒక కాంట్రాక్టర్ దగ్గర పనిలో చేరాడు. గత మూడునెలలుగా ఇఎస్‌పి విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు. రోజు మాదిరిగా ఇఎస్‌పి విభాగం వద్ద మోహన్, మరికొంత మంది కార్మికులంతా క్రెయిన్ ద్వారా ఐరన్‌ప్యానల్స్‌ను పైకి పంపించారు. క్రెయిన్ ద్వారా పైకి వెళ్ళిన ఐరన్ ప్యానల్స్ ఒకపక్కకు ఒరిగిపోయి కింద ఉన్న మోహన్‌పై పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా అక్కడే ఉన్న ఒరిస్సాకు చెందిన కార్మికులు పురుషోత్తం, వసంతబాబు, ఆర్ లింగయ్యలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మోహన్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈమేరకు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుండగా కెటిపిఎస్‌లోని పలు యూనియన్ల నాయకులు మృతిచెందిన మోహన్ కుటుంబానికి రూ 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. మృతునికి భార్య భారతి ఉన్నారు.