ఖమ్మం

నిత్యవసరాల ధరలను నియంత్రించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(జమ్మిబండ), మే 30: రాష్ట్ర ప్రభుత్వం నిత్యవసర ధరలు నియంత్రించడంలో విఫలమైందని, దీనికి తోడు బ్లాక్ మార్కెటర్లతో కుమ్మకై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మహ్మద్ సలాం ఆరోపించారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో చామకూరి అధ్యక్షతన జరిగిన ముఖ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ మార్కెట్‌ను నియంత్రించడంలో ఘోరంగా విఫలమైందన్నారు. పేదవారికి అందించే రేషన్ షాపులలో కూడా సక్రమంగా నిత్యవసర సరుకులను పంపిణీ చేయడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ షాపుల్లో ఇచ్చే పప్పు్ధన్యాలు, నూనెనో కోతపెట్టిందన్నారు. రైతు మార్కెట్లంటూ గొప్పలు చెబుతున్న ప్రభుత్వం రైతులు కాకుండా దళారులచే ధరలు ఇష్టారాజ్యంగా పెంచుతున్నారని, వాటిని నియంత్రించలేని స్థితిలో అధికారులు ఉన్నారని స్పష్టం చేశారు. అందరూ దొంగల్లా వ్యవహరిస్తూ పేద వర్గాలపై భారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ధరలు అందుబాటులో ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు నూనె శశిధర్, ఎండి రెహ్మాన్, బోడా వీరన్న, ఎస్‌కె చానా, డి రవి పాల్గొన్నారు.