ఖమ్మం

పర్ణశాలలో పోటెత్తిన హనుమాన్ భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుమ్ముగూడెం, మే 30: ప్రముఖ పుణ్యక్షేత్రం పర్ణశాలలో సోమవారం హనుమాన్ భక్తులు పోటెత్తారు. ఈ నెల 31న హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ మాల వేసుకున్న భక్తులు భారీ సంఖ్యలో పర్ణశాలకు వచ్చారు. పర్ణశాలలో గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు. పక్కనే పంచవటి కుటీరం, సీతమ్మ నారచీరల ప్రదేశాలను తిలకించి పులకించారు. భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని ఆలయ సిబ్బంది భక్తులకు పులిహార ప్రసాదాన్ని పంపిణీ చేశారు. గ్రామ పంచాయితీ సర్పంచి వాగే లక్ష్మీదేవి, కార్యదర్శి ఖాదర్‌మీయా శానిటేషన్ పనులు, తాగునీటి సౌకర్యాలను కల్పించారు. ఎండవేడిమిని సైతం లెక్కచేయకుండా అధిక సంఖ్యలో భక్తులు పర్ణశాలకు వచ్చారు. పర్ణశాలలోని చెట్టునీడన సేదతీరుతూ స్వామి దర్శనం చేసుకోని తిరుగు ప్రయాణం అయ్యారు. మంగళవారం హనుమాన్ జయంతి ఉండటంతో భారీ సంఖ్యలో భక్తులు వస్తారని అంచనాను దేవాలయ సిబ్బంది వేస్తున్నారు.