ఖమ్మం

రామయ్యకు ముత్తంగి సేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, మే 30: శ్రీసీతారామచంద్రస్వామికి సోమవారం ముత్తంగి సేవ నిర్వహించారు. గోదావరి నుంచి తీర్థబిందెను తెచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామికి ముత్యాలతో పొదిగిన వస్త్రాలను ధరింప చేశారు. లక్ష్మీతాయారు అమ్మవారు, ఆంజనేయస్వామికి కూడా ముత్యాల దుస్తులు ధరింపచేశారు. ఈ సందర్భంగా స్వామికి విష్వక్షేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన నిర్వహించి బాలభోగం సమర్పించారు. అనంతరం బేలమండపంలో నిత్యకల్యాణం నిర్వహించారు. నిత్యకల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
నేడు హనుమజ్జయంతి
నేడు శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో హనుమజ్జయంతి వేడుకగా నిర్వహించనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి హనుమాన్ దీక్షితులు భద్రాచలానికి తరలివస్తున్నారు. ఉదయం 3 గంటలకు ఆలయం తలుపులు తెరిచి సుప్రభాత సేవ చేయనున్నారు. అనంతరం ఆంజనేయస్వామికి ఏకాంతంగా అభిషేకం చేస్తారు. హనుమాన్ దీక్షితుల మాల, దీక్షల విరమణ ఉంటుంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం దేవస్థానం ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రత్యేకంగా లడ్డూలు తయారు చేయిస్తున్నారు. సుందరకాండ పారాయణం నిర్వహిస్తున్నారు.