ఖమ్మం

జెబిసిసిఐ నుండి సింగరేణిని తప్పించే ప్రయత్నాన్ని ప్రతిఘటిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, మే 30: జెబిసిసిఐ పరిధి నుండి సింగరేణిని వేరుచేసే ఆలోచన చేస్తే కార్మికవర్గం నుండి తీవ్ర ప్రతిఘటన తప్పదని సిఐటియు అనుబంధ సింగరేణి కాలరీస్ ఎంప్లారుూస్ యూనియన్ కొత్తగూడెం బ్రాంచి అధ్యక్షుడు జి రాజారావు హెచ్చరించారు. సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ సింగరేణిని జెబిసిసిఐ పరిధి నుండి తప్పించే ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్లు ప్రచారం జరుగుతోందని, ఇదే నిజమైతే సింగరేణి కార్మికులకు ఇంతకంటే పెద్ద దుర్వార్తవుండదని అన్నారు. సింగరేణి కార్మికులకు బంగారు భవిష్యత్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఉంటుందనే ఆశతో తెలంగాణ ఉద్యమంలో భాగంగా జరిగిన సకలజనుల సమ్మెలో పాల్గొన్నారని తెలిపారు. అదేవిధంగా సార్వత్రిక ఎన్నికల్లో కూడా బొగ్గుగనుల ప్రాంతాల్లో టిఆర్‌ఎస్‌ను అఖండ మెజార్టీతో గెలిపించి రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి దోహదపడ్డారని అన్నారు. అలాంటి కార్మికులకు న్యాయం చేయాల్సిందిపోయి అంధకారంలోకి నెట్టే ప్రయత్నాలను టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేయడం దురదృష్టకరమన్నారు. సింగరేణిసంస్థ పుట్టిన 90 సంవత్సరాల తరువాత అనేక పోరాటాల ఫలితంగా 1975వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా బొగ్గుగని కార్మికులందరికీకి ఒకేరకమైన వేతనాలు, సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో వేజ్‌బోర్డు ఏర్పడిందని అన్నారు. మిగతా బొగ్గుసంస్థలతో ఇప్పుడు సింగరేణిని వేరుచేస్తే వేతనాలు, సదుపాయాల విషయంలో తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. అంతేకాకుండా ప్రైవేటీకరణ ప్రమాదం కూడా ఎక్కువ అవుతుందన్నారు. దేశవ్యాప్తంగా బొగ్గుగని కార్మికులు ఉమ్మడి పోరాటాలు నిర్వహిస్తేనే అనేక హక్కులు లభించాయని, ఈఅవకాశం కూడా సింగరేణి కార్మికులకు ఉండకుండాపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జెబిసిసిఐ నుండి సింగరేణిని విడదీసే ప్రయత్నాలు చేస్తే కార్మికసంఘాలన్ని ఐక్యంగా ప్రతిఘటించడానికి సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.