ఖమ్మం

ప్రజాపాలనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(ఖిల్లా), మే 30: ప్రజాపాలన అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు సంవత్సరాల పాలనలో చేయనివి చేసినట్లుగా గొప్పలు చెబుతూ ఆశ, అడియాశల మధ్య అభూత కల్పనలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలు ఎప్పుడు పూర్తి అవుతాయో అర్ధం కాని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. బిజెపి, టిఆర్‌ఎస్ రహస్య ఎజెండాను ప్రజలకు తెలియజేయాల్సి ఉందన్నారు. వ్యక్తి స్వేచ్ఛ మీద దాడి చేస్తూ హక్కులకు భంగం కల్గిస్తూ వ్యవస్థను భ్రస్టు పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం ప్రచారానికే ప్రధాన్యతనిస్తూ ప్రజల సమస్యలను పట్టించుకోవటంలేదన్నారు. వికాశ్, అచ్ఛాదిన్ అంటూ స్వంత ప్రచారానికే కార్యక్రమాలు చేపట్టిందన్నారు. రాజ్యాంగ బద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలను కూల్చే ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. గుజరాత్ పెట్రోల్ కుంభకోణం, మధ్యప్రదేశ్ భూ కుంభకోణాల్లో మోడీ ప్రభుత్వం కురుకుపోయిందన్నారు. రాష్ట్రంలో కరవుతో ప్రజలు అల్లాడుతుంటే పాలకులు పట్టించుకోవటంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక వాగ్దానాలతో అధికారం చేపట్టిన కెసిఆర్ వాటిని అమలు పర్చటంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమాన్ని మరిచారని, దళితులకు మూడెకరాల భూమి కాగితాలకే పరిమితమైందన్నారు. విలేఖరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అయితం సత్యం, నాయకులు కట్ల రంగరావు, తాజ్ పాల్గొన్నారు.