ఖమ్మం

కొత్త జిల్లాలను స్వాగతిస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(కల్చరల్), మే 30: పాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక రాజ్‌పథ్ ఫంక్షన్‌హాల్‌లో జరుగుతున్న రాజకీయ శిక్షణా తరగతుల్లో పాల్గొనడానికి వచ్చిన ఆయన ఆదివారం విలేఖర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో 14,15 కొత్త జిల్లాలను ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రకటన చేయాలనుకోవడం సంతోషించదగిన విషయమన్నారు. అయితే ప్రభుత్వం వద్ద కావల్సినంత సమాచారం, అధికారులు ఉన్నందున ముందుగా కొత్త జిల్లాలపై ఒక ప్రతిపాదన తెచ్చి దానిపై రాజకీయ పార్టీల, వివిధ సంస్థలు ప్రజల నుండి అభిప్రాయ సేకరణ చేయాలి తప్పా, ముందే ప్రజాభిప్రాయాలు, అభ్యంతరాలు చెప్పమనడం అప్రజాస్వామికమని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన నాయకులుగా ప్రజలనుండి గౌరవాన్ని పొందండి కానీ, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను మరిచి సంబురాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని న్నారు. 92 శాతంగా ఉన్న ఎస్‌సి, ఎస్‌టి, బిసి, ఎంబిసి, మైనారిటీలకు న్యాయం చేయకుండా అభివృద్ధి సాధించడం సాధ్యం కాదన్నారు. వీరి కోసం గత ప్రభుత్వాలు కేటాయించిన నిధుల్లోనే కోత విధించిందని విమర్శించారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్న ప్రభుత్వం హరితహారం పేరుతో ఉన్న భూమిని లాక్కోవాలని చూస్తుందని దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్, కార్పొరేషన్‌లతో పాటు ఉప ఎన్నికల్లో గెలవడానికై వేసిన ఎత్తులు, ఓట్ల కోసం ప్రజలకు ఇచ్చిన ఆచరణ సాధ్యంకాని హామీలు, ఆకర్ష్ పేరుతో ఇతర పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులను నయానో, భయానో తమ పార్టీలోకి మార్చుకొని విజయం సాధించింది చూసుకొని అదే సాధించిన అభివృద్ధి అనుకుంటే పొరపాటేనన్నారు. ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాలన్నింటిని వెంటనే అమలు జరపాలని లేని పక్షంలో ప్రజలు సహనం కోల్పోయి తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం సన్నద్దమైయ్యే దానిలో భాగంగానే దాదాపు 1700 మంది రాష్ట్ర స్ధాయి నాయకత్వనికి రాష్ట్రంలో 3 చోట్ల ఈ శిక్షణా తరగతులు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌రావు, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు బి వెంకట్, జి రాములు పాల్గొన్నారు.