ఖమ్మం

అమరుల కుటుంబాలకు అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఖమ్మం జిల్లా పురుడు పోసిందని, జిల్లాభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రజల సహకారంతో రాష్ట్రంలోని అభివృద్ధిలో ప్రథమ స్థానం సాధించేలా కృషి చేస్తామన్నారు. గురువారం స్థానిక పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో తెలంగాణ రాష్ట్ర 2వ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ జెండాను కలెక్టర్ లోకేష్‌కుమార్, ఎస్పీ షానవాజ్ ఖాసీంతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలనే ఆరు దశాబ్ధాల కల సాకారమై నేటికి రెండు సంవత్సరాలని, ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా సుదీర్ఘ పోరాటాలు, ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగా 29వ రాష్ట్రంగా తెలంగాణను సాధించుకున్నామన్నారు. నాలుగున్నర దశాబ్ధాల క్రితం 1969 జనవరి 8న అన్నాబత్తుల రవీంద్రనాథ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ నగరంలోని గాంధీచౌక్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారన్నారు. ఆ ఉద్యమం రాష్టవ్య్రాప్తంగా దావానంలా వ్యాపించిందని గుర్తు చేశారు. కవులు, రచయితలు, మేథావులు, కళాకారులు, ఉద్యోగులు, సకల జనులు ఈ ఉద్యమంలో ఒక్కటై కదలారని, అలుపెరగని పోరాట మలిదశ మహోద్యమంలోనూ ఖమ్మంది ప్రత్యేకంగా నిలిచిందన్నారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందన్నారు. అందులో భాగంగానే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, నిరంతరం విద్యుత్, భక్తరామదాసు ఎత్తిపోతల పథకం, ఆసరా, పరిశ్రమలు, డబుల్‌బెడ్‌రూం, కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ వంటి అనేక కార్యక్రమాలు చేపట్టిందని, ప్రజలకు అన్ని రకాలుగా మేలు చేయాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. జల వనరులు, వర్షపు నీటి సంరక్షణతో పాటు నీటి లభ్యత పెంచటం కోసం మిషన్ కాకతీయ పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. జిల్లాలో 4517 చెరువులను ఐదేళ్ళలో పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో ఫేజ్-1 కింద గత సంవత్సరం 245కోట్లతో 851చెరువులను పనులు చేపట్టగా, వాటిలో 801పనులు పూర్తయ్యాయన్నారు. అదే స్ఫూర్తితో ఫేజ్-2కింద 323కోట్ల రూపాయలతో 927చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టగా, పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. అదే విధంగా మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. జిల్లాలోని 41మండలాల్లో 2,658 ఆవాసాలు, 7 మున్సిపాలిటీల్లో 26లక్షల 66వేల ప్రజలకు తాగునీటిని అందించేందుకు 3558కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నామన్నారు. పాలేరు సెగ్మెంట్ పరిధిలో 78, వైరా సెగ్మెంట్ పరిధిలోని 12గ్రామాలకు తాగునీటిని అందిస్తామన్నారు. వచ్చే సంవత్సరంలోగా అన్ని గ్రామాకలు సురక్షిత తాగునీటిని అందించి ప్రజల కష్టాలను తీర్చనున్నామన్నారు. భక్తరామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ద్వారా సాగునీటి సౌకర్యం లేని పాలేరు నియోజకవర్గంలోని ఎతె్తైన కరవు పీడిత ప్రాంతాలైన తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి, ముదిగొండ, ఖమ్మం రూరల్ మండలాలకు చెందిన 58,958ఎకరాలకు సాగునీటిని అందించేందుకు 91కోట్లతో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టామన్నారు. సీతారామ ప్రాజెక్ట్ ద్వారా జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించి బీడు భూములను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశ్యంతో 7,926కోట్లను కేటాయించామని, ఈ వారంలో టెండర్లు పిలిచి ప్రాజెక్ట్ పనులకు శ్రీకారం చుట్టనున్నామన్నారు.
విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు గాను మణుగూరు పట్టణానికి సమీపంలో జెన్‌కో ఆధ్వర్యంలో 7,290కోట్ల వ్యయంతో 1080మెగావాట్ల సామర్థ్యం కలిగిన థర్మల్ విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టామన్నారు. పాల్వంచలో కొత్తగా కెటిపిఎస్ ఏడో దశ యూనిట్‌లో భాగంగా 800 మెగావాట్ల ఉత్పాదన ప్రాజెక్ట్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. జిల్లాలో లోవోల్టేజీ సమస్యను పరిష్కరించేందుకు 40కోట్ల 50 లక్షలతో 33/11కెవి 27 సబ్ స్టేషన్లను నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి రెండు వరుసల రహదారి సౌకర్యం లేని 7మండలాలను జిల్లా కేంద్రంతో అనుసంధానం చేసేందుకు 61 కిలోమీటర్ల రహదారులను అభివృద్ధి చేసేందుకు 95కోట్లు మంజూరు చేశామన్నారు. రోడ్ల అభివృద్ధికి మొత్తం 1470 కిలోమీటర్ల మేరకు 1411కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. జాతీయ రహదారులుగా ప్రస్తుతం విజయవాడ - జగదల్‌పూర్, కోదాడ - ఖమ్మం - మహబూబాబాద్, హైదరాబాద్ - భూపాలపట్నం రోడ్లను కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులుగా గుర్తించగా విజయవాడ జగదలపూర్ రోడ్డు నిర్మాణం పనులు జిల్లాలో 100కిలోమీటర్ల మేరకు 456కోట్ల రూపాయలతో జరుగుతున్నాయన్నారు. ఐటిడిఏ ఇంజనీరింగ్ విభాగం ద్వారా నియోజకవర్గ అభివృద్ధి, ఎంపి లాడ్స్, సమీకృత, కార్యచరణ ప్రణాళిక, గిరిజన ఉప ప్రణాళిక నిధులు 63కోట్లతో ఐటిడిఏ పరిధిలో 604 పనులు చేపట్టామన్నారు.
జిల్లాలో పరిశ్రమల ఆవశ్యకతను గుర్తించిన ప్రభుత్వం 101 మంది 90కోట్ల 19లక్షల ప్రతిపాదిత పెట్టుబడితో పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోగా అనుమతులు మంజూరు చేశామన్నారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ళ నిర్మాణం కింద రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు 2015-16వ సంవత్సరానికి గాను 6వేల గృహాలను కేటాయించిందని, త్వరలో వీటి పనులను ప్రారంభించేందుకు చర్యలు వేగవంతం చేస్తున్నామన్నారు. ఆసరా పథకం కింద గతంలో 6కోట్ల రూపాయలను మాత్రమే ప్రభుత్వం అందించగా, దానిని ఇప్పుడు 5రెట్లు పెంచి 28కోట్ల రూపాయల పెన్షన్‌ను ప్రతి నెల పంపిణీ చేస్తున్నామన్నారు. ఆసరా పథకం కింద నేటి వరకు 2లక్షల 95వేల లబ్ధిదారులకు 428కోట్ల పంపిణీ చేశామన్నారు. పోషకాహారం, కల్యాణలక్ష్మీ లాంటి అనేక కార్యక్రమాలు పేద దరి చేర్చి ప్రజల మన్ననలు పొందామన్నారు. తెలంగాణాకు హరితహారం పేరుతో పల్లెలు పచ్చబడాలనే ఉద్దేశ్యంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టి రిజర్వ్ ఫారెస్ట్‌లో 2900హెక్టార్లలో 44లక్షల మొక్కలను నాటనున్నామన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలను బలోపేతం చేశామన్నారు. పంట రుణమాఫీ కింద జిల్లాలో 3,80,0009 మంది రైతులను గుర్తించగా 1727కోట్లను పంట రుణమాఫీగా గుర్తించి, 3,58,040మంది రైతులకు రెండు విడతల్లో 818కోట్ల రూపాయలను మాఫీ చేశామన్నారు. త్వరలో మిగతా మాఫీ జరగనుందన్నారు.
కొత్తగూడెం విమానశ్రయ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని, త్వరలో భూసేకరణ పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తామన్నారు. అదే విధంగా బైపాస్‌రోడ్డులోని ఎనె్నస్పీ క్వార్టర్స్ స్థలంలో 7.7ఎకరాలో 15కోట్ల రూపాయల వ్యయంతో అధునాతన సౌకర్యాలతో నూతన బస్టాండ్‌ను నిర్మించనున్నామన్నారు. జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం కింద ఖమ్మం, కొత్తగూడెంకు 19 బస్సులు ప్రవేశపెట్టామన్నారు. ఇతర ముఖ్య పట్టణాలు, ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికుల సౌకర్యార్థం రాజధాని, వోల్వో బస్సులను త్వరలో ప్రవేశపెట్టనున్నామన్నారు.