ఖమ్మం

ఉత్తమ కార్మికులను సన్మానించిన సింగరేణి సిఎండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా సింగరేణిలో అంకితభావంతో పనిచేస్తూ రక్షణతో కూడిన ఉత్పత్తికి ప్రాధాన్యతనిస్తున్న పదిమంది ఉద్యోగులను ఉత్తమ కార్మికులుగా ఎంపిక చేసిన యాజమాన్యం స్థానిక ప్రకాశం స్టేడియంలో గురువారం జరిగిన ప్రధాన వేడుకల్లో వారిని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీ్ధర్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించింది. సన్మానం అందుకున్న వారిలో బెల్లంపల్లి ఏరియా కైరిగూడ ఓసిపిలో ఇపి ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఎస్‌డి సర్వర్, మందమర్రి ఏరియా ఆర్‌కెపి- ఓసిపిలో డెప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్న బి రవీందర్‌కుమార్, శ్రీరాంపూర్ ఏరియా ఆర్‌కె-6ఇంక్లైన్‌లో ఎస్‌డిఎల్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న పి పూర్ణచందర్, ఆర్‌జి-1 ఏరియాలోని జిడికె-1అండ్3లో ఎస్‌డిఎల్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న తోట మల్లేష్, ఆర్‌జి-2 ఏరియా ఓసిపి-3లో ఇపి ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఎండి రహమతుల్లా, ఆర్‌జి-3 ఏరియాలో ఎఎల్‌పిలో డెప్యూటీ ఎస్‌ఇగా పనిచేస్తున్న డిఎస్‌ఎస్ ప్రసాద్, భూపాలపల్లి ఏరియా కెటికె-2ఇంక్లైన్‌లో ఎస్‌డిఎల్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న బి యాదగిరి, మణుగూరు ఏరియా పికెఓసి-2లో హెచ్‌ఓఎంగా పనిచేస్తున్న కె రాజేశ్వరరావు, ఇల్లెందు ఏరియా జెకె-5ఇంక్లైన్ ఓసిలో ఇపి ఆపరేటర్‌గా పనిచేస్తున్న కె రాజలింగం, కొత్తగూడెం ఏరియా జెవిఆర్‌ఓసిలో మెకానికల్ ఫోర్‌మెన్‌గా పనిచేస్తున్న ఎ చంద్రశేఖర్‌రావులు ఉన్నారు. సంస్థ డైరెక్టర్లు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

ఘనంగా వేడుకలు
భద్రాచలం, జూన్ 2: ఆర్డీఓ కార్యాలయంలోనూ ఐటీడీఏ పీఓ రాజీవ్‌గాంధీ హన్మంతు జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం ఆయన జాతీయపతకాన్ని ఎగురవేసి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. బంగారు తెలంగాణ సాధన కోసం అందరం కలిసి కట్టుగా శ్రమిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో డీఏఓ రామకృష్ణ సిబ్బంది పాల్గొన్నారు.