ఖమ్మం

గూడూరుపాడులో సిపిఐ, టిఆర్‌ఎస్ వర్గీయుల మధ్య ఘర్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం రూరల్, జూన్ 2: మండలంలోని గూడూరుపాడు గ్రామంలో సిపిఐ, టిఆర్‌ఎస్ వర్గీయుల మధ్య గురువారం ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సంఘటనలో టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, ఇరువర్గాలకు చెందిన పలువురికి తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. గ్రామంలో ఒకవైపున సిపిఐ వర్గీయులు పుచ్చకాయల శ్రీనివాసరావు వర్ధంతి సభను జరుపుకోగా, మరోవైపున టిఆర్‌ఎస్ వర్గీయులు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించుకున్నారు. వేడుకల్లో భాగంగా జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత జెండా ఆవిష్కరణ చేస్తుండగా, మరోవైపున అదేపార్టీకి చెందిన కార్యకర్తలు టపాసులు పేల్చారు. అదేసమయంలో బండి వెంకటయ్యకు చెందిన గడ్డివామి నిప్పంటుకొని మంటలు చెలరేగడంతో సిపిఐ పార్టీ కార్యాలయంలో ఉన్నవారు, టిఆర్‌ఎస్ వేడుకల్లో పాల్గొన్నవారంతా మంటల వైపు పరుగెత్తారు. ఇరుపార్టీలకు చెందిన వారు తమపై దాడి చేసేందుకు వస్తున్నారేమోనన్న భయంతో పరస్పరం రాళ్లు రువ్వుకున్నారని స్థానికులు పేర్కొన్నారు. ఈ సంఘటనలో గ్రామానికి చెందిన సత్తి సంగయ్య (60) అక్కడికక్కడే మృతి చెందగా, ఇరువర్గాలకు చెందిన పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న అడిషనల్ ఎస్‌పి సాయికృష్ణ, డిఎస్‌పిలు సురేష్‌కుమార్, అశోక్‌కుమార్, సిఐలు కిరణ్‌కుమార్, ఆంజనేయులు, పలువురు ఎస్‌ఐలు సంఘటనా ప్రదేశానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన సంగం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతునికి భార్య పుల్లమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా సంఘటనలో గాయపడ్డ టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన గోకినపల్లి మహేష్, అతని తల్లిదండ్రులు సైదమ్మ, రామ్మూర్తి, కుర్రి తిరుపతిరావు, మృతుని కోడలు సత్తి రమాదేవి, బండారు వెంకన్న, లిక్కి కోటేశ్వరరావు, మంకెన అప్పారావు, సిపిఐకి చెందిన పొడేటి అంజయ్య, కొలిచలం గోపయ్య, నెమలి బాలకృష్ణ, కందుల బాబు, ఎలటూరి పున్నయ్య, బండి టెండూల్కర్ తదితరులను చికిత్స నిమిత్తం పోలీసులు ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్టు ఇరుపార్టీల నాయకులు తెలిపారు.
కావాలనే ఘర్షణ సృష్టించారు
సిపిఐ పార్టీకి చెందిన సర్పంచ్ కరుణాకర్, మరికొంత మంది నాయకులు టిఆర్‌ఎస్ పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేక కావాలనే ఘర్షణ సృష్టించారని ఆపార్టీకి చెందిన పలువురు నాయకులు ఆరోపించారు. మొదటి నుంచి ఈ గ్రామంలో సిపిఐ పెత్తనం కోసం పాకులాడుతుందని, ఎదుటి పార్టీ ఎదిగితే తట్టుకోలేరని పేర్కొన్నారు.
బాంబులు పేల్చడం వల్లే ఈ ఘర్షణ
సంబరాల్లో భాగంగా టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన కొందరు బాంబులు పేల్చడంతో వరిగడ్డి వామి తగులబడిందని, మంటలు ఎగిసిపడుతుంటే తమ పార్టీ కార్యకర్తలు మంటలు ఆర్పేందుకు వెళ్తుంటే రాళ్లు రువ్వి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని సిపిఐకి చెందిన పలువురు నాయకులు ఆరోపించారు.