ఖమ్మం

అంధకారంలో రామదాసు ధ్యాన మందిరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేలకొండపల్లి, జూన్ 3: ఒక పక్క తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు అంగరంగ వైభవంగా విద్యుత్ కాంతులతో వెలుగుతుంటే.. మరోపక్క ప్రముఖ వాగ్గేయకారుడు కంచర్ల గోపన్న (్భక్తరామదాసు) ధ్యాన మందిరం చిమ్మచీకట్లో మగ్గుతోంది. భద్రాచలం దేవస్థానం దత్తత తీసుకున్న నేలకొండపల్లి భక్తరామదాసు ధ్యాన మందిరంపై అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నామంటూ భద్రాచలం దేవాలయం పాలకులు చెప్తున్న మాటలకు చేతలకు పొంతన కుదరడం లేదు. గతంలో రావాల్సిన బకాయిలను నేటికి అందలేదు. ఇక్కడ ధ్యా మందిరాన్ని పట్టించుకోని భద్రాచలం దేవస్థాన పాలకులు భక్తరామదాసు పేరిట కీర్తనలంటూ భారీగా కచేరీలు, పాటలు పోటీలు నిర్వహిస్తూ భద్రాచలానికే పరిమితం చేస్తున్నారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వంత నియోజకవర్గంలోని నేలకొండపల్లిలో ఉన్న భక్తరామదాసు ద్యాన మందిరంపై సవతి ప్రేమ చూపిస్తున్నారు. ఇక్కడ మందిరంలో సుమారు 8 నెలల విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్ అధికారులు ద్యాన మందిరానికి సరఫరా నిలిపివేశారు. 4వేల రూపాయల విద్యుత్ బకాయి చెల్లించాలని, అధికారులు చెల్లించిన రోజే ద్యాన మందిరానికి సరఫరా ఇస్తామని విద్యుత్ అధికారులు చెప్తున్నారు. దీనిపై ఎన్నిసార్లు చెప్పినా భద్రాచలం దేవస్థానం వారు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. తెలంగాణ రాష్ట్రం విద్యుత్ వెలుగులతో వెదజల్లుతుంటే ఇక్కడ ధ్యాన మందిరం అంధకారంతో కనపడుతుండడంతో ఇక్కడి ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.అధికారులు మేలుకొని సత్వరమే విద్యుత్ బకాయిలు చెల్లించి విద్యుత్ సరఫరా జరిగేలా చూడాలని కోరుతున్నారు.