ఖమ్మం

ఇంగ్లీష్ మీడియం ప్రారంభించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖానాపురం హవేలి, జూన్ 3: రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో కెజి తరగతులు, సమాంతరంగా ఇంగ్లీష్ మీడియాన్ని ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రారంభించాలని టిఎస్‌యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక సంఘం కార్యాలయంలో జరిగిన ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు కోరుకున్న విధంగా పేద ప్రజలకు అందుబాటులో ఉండే ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రారంభించాలన్నారు. తక్షణమే ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని, గుణాత్మక విద్యను విద్యార్థులకు అందించాలన్నారు. రాష్టవ్య్రాప్తంగా యుటిఎఫ్ చేపట్టిన విద్యాపాదయాత్రలో ప్రజల నుంచి వచ్చిన సూచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళామన్నారు. సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరిగిందే తప్ప సమస్య నేటి వరకు పరిష్కారం కాలేదన్నారు. రాష్ట్రం సాధించి 2సంవత్సరాలు పూర్తయిన ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కారానికి నోచుకోకపోవటం దురదృష్టకరమన్నారు. అనంతరం సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి మాట్లాడుతూ ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న పండిట్, పిఈటి పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలని, 10వ పిఆర్‌సి బకాయిలను నగదు రూపంలో వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. హెల్త్‌కార్డ్సు ద్వారా ఉచితంగా వైద్య సేవలు అన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో అందించాలన్నారు. అదే విధంగా పదోన్నతులు, బదిలీల ప్రక్రియను తక్షణమే చేపట్టాలని, లేకుంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు నాగమల్లేశ్వరరావు, నెల్లూరి వీరబాబు, బండి నర్సింహారావు, రాందాస్, రమాదేవి, మహబూబ్ అలీ, ఆంజనేయులు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.