ఖమ్మం

ప్రొటోకాల్ తప్పక పాటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జూన్ 6: జిల్లాలో నిర్వహించే ప్రతి అధికార కార్యక్రమానికి జిల్లా అధికారులు ప్రొటోకాల్ పాటించాలని జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్‌లో అధికారులతో మాట్లాడుతూ ప్రొటోకాల్ పాటించని అధికారిపై నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికార కార్యక్రమాల సందర్భంగా ఏర్పాటు చేసే శిలాఫలకాలపై, ఆహ్వాన పత్రికలపై ప్రోటోకాల్ ప్రకారమే ప్రజాప్రతినిధుల పేర్లను చేర్చాలని, వాటిని ముద్రించే ముందు జిల్లా రెవెన్యూ అధికారి ఆమోదం తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించారు. వార్డు మెంబర్ నుంచి మంత్రుల వరకు ప్రోటోకాల్ పాటించాల్సిందేనన్నారు. జిల్లాలో మంత్రి పర్యటన సమయంలో జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. ఆ పర్యటనలకు సంబంధిత శాఖల అధికారులు పూర్తి సమాచారంతో హాజరు కావాలన్నారు. ఈ నెల 2వ తేదీన నిర్వహించిన తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రోటోకాల్‌పై అనేక ఫిర్యాదులు అందాయని, దానిపై బాధ్యుల నుంచి వివరణ కోరడం జరిగిందన్నారు. అదే విధంగా అధికారికంగా నిర్వహించే కార్యక్రమాల సందర్భంగా ముద్రించే బ్యానర్లు, ప్లెక్సీలపై సివిల్ కండక్ట్ రూల్ ప్రకారం జిల్లా కలెక్టర్లతో పాటు ఏ అధికారి ఫొటో కూడా ఉండరాదని సూచించారు. సమావేశంలో అదనపు జేసి శివ శ్రీనివాస్‌లు, డిఆర్వో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.