ఖమ్మం

ఏకతాటిపైకి నాలుగు జాతీయ కార్మికసంఘాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, జూన్ 7: బొగ్గుగని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఐదు జాతీయ కార్మికసంఘాలలో ఐఎన్‌టియుసి, ఎఐటియుసి, సిఐటియు, బిఎంఎస్ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి మంగళవారం హైద్రాబాద్‌లో సమావేశమయ్యాయి. మరో జాతీయ కార్మికసంఘమైన హెచ్‌ఎంఎస్, సింగరేణిలో గుర్తింపుసంఘంగా ఉన్న తెలంగాణ బొగ్గుగని కార్మికసంఘానికి ఆహ్వానాలు పంపించినప్పటికి వారు సమావేశానికి హాజరుకాలేదని హాజరైన నాలుగు జాతీయ కార్మికసంఘాల నాయకులు స్పష్టం చేశారు. ప్రధానంగా బొగ్గుగని కార్మికుల 10వవేజ్‌బోర్డు, సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు, సకలజనుల సమ్మె వేతనం, సింగరేణిలో ఐదు భూగర్భగనులను గ్లోబల్‌టెండర్ల ద్వారా ఔట్‌సోర్సింగ్ చేయడం, సింగరేణి కార్మికులకు సొంతింటి పథకం తదితర విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. సింగరేణిని 10వవేజ్‌బోర్డు నుండి వేరుచేసే కుట్రలను తిప్పికొట్టి, ఆవేజ్‌బోర్డులో సింగరేణిని భాగస్వామిగా కొనసాగించాలని కోరుతూ ఈనెల 15వతేదీన గోదావరిఖనికి వస్తున్న కేంద్రబొగ్గుశాఖామంత్రికి వినతిపత్రం అందించాలని నిర్ణయించారు. అదేవిధంగా సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల పునరుద్దరణ చేయాలని, సకలజనుల సమ్మె వేతనాన్ని వెంటనే చెల్లించాలని, ఐదు భూగర్భగనులను గ్లోబల్‌టెండర్ల ద్వారా ఔట్‌సోర్సింగ్ చేయాలని చేసిన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, సింగరేణి కార్మికులకు సొంతింటి పథకం అమలుచేయాలని తదితర డిమాండ్లతో సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీ్ధర్‌కు డిమాండ్ నోటీసు అందజేయాలని కోరారు. ఒకవేళ సింగరేణి యాజమాన్యం స్పందించని పక్షంలో నిరవధిక సమ్మెకు వెళ్ళాలని నిర్ణయించారు. సమావేశానికి సింగరేణి గుర్తింపుసంఘమైన టిబిజికెఎస్, జాతీయ కార్మికసంఘమైన హెచ్‌ఎంఎస్‌లు హాజరుకాకపోవడం వలన తిరిగి ఈనెల 13న గోదావరిఖనిలో మరో సమావేశం నిర్వహించి తుదినిర్ణయం తీసుకుంటామని ఎఐటియుసి అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు.