ఖమ్మం

అక్రమ అరెస్టులపై ప్రజాసంఘాల ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(ఖిల్లా), జూన్ 9: ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఖమ్మం పర్యటన సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేయడం పట్ల ఇఫ్టూ, పివైఎల్, పివొడబ్ల్యూ తదితర ప్రజాసంఘాలు తీవ్రంగా ఖండించాయి. విద్యార్థుల అక్రమ అరెస్ట్‌లను నిరసిస్తూ రామనర్సయ్య విజ్ఞాన కేంద్రం నుండి ప్రదర్శన నిర్వహించి బైపాస్‌రోడ్డు వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నేతలు రామయ్య, సివై పుల్లయ్య, శిరోమణి తదితరులు మాట్లాడుతూ జిల్లాలో గుట్టలుగా పేరుకు పోయిన విద్యారంగ సమస్యలను పరిష్కారించాలని ప్రశ్నిస్తారేమోనన్న భయంతో అర్థరాత్రి విద్యార్థులను అరెస్ట్ చేయడం అమానుషమన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పాలకులకు చెప్పే స్వేచ్ఛకూడా లేదా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన విద్యార్థుల పట్ల పాలకులు ప్రవర్తిస్తున్న తీరును ఎండగట్టారు. అరెస్ట్‌లతో సమస్యలు ముగుస్తాయనుకోవడం అవివేకమన్నారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చే
పిడిఎస్‌యు ఆధ్వర్యంలో
విద్యార్థుల అక్రమ అరెస్ట్‌లను నిరసిస్తూ స్థానిక బైపాస్‌రోడ్డులో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పి రాజా, నాగరాజు, మహేష్, జగన్, నాగేశ్వరరావు, నాగలక్ష్మి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో
డెప్యూటి సిఎం కడియం శ్రీహరి గురువారం ఖమ్మం పర్యటన సందర్భంగా మంగళవారం అర్థరాత్రి నుండి విద్యార్థులను అక్రమ అరెస్ట్‌లు చేయడాన్ని ఖండిస్తూ నగరంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు టి నాగరాజు, కిరణ్, రమేష్, వంశీ, ఉమామహేష్, రవి, శరత్ తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెంలో...
రుద్రంపూర్: తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం చేస్తున్న అక్రమ నిర్భందాన్ని నిరసిస్తూ పిడిఎస్‌యు ఆధ్వర్యంలో గురువారం కొత్తగూడెం పట్టణంలోని బస్టాండ్‌సెంటర్‌లో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈసందర్భంగా పిడిఎస్‌యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ రాకేష్ మాట్లాడుతూ ఖమ్మంలో పిడిఎస్‌యు నాయకులను అక్రమ అరెస్ట్‌ల ద్వారా నిర్భందించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరుణంలో విద్యార్థులకు పెద్దపీఠ వేస్తామని, లక్ష ఉద్యోగాలు ఇస్తామన్న కెసిఆర్ అధికారంలోకి రాగానే హామీలను అమలుచేయడంలేదని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం హేయమైన చర్యన్నారు. కెసిఆర్ ప్రభుత్వం ఇప్పటివరకు స్కాలర్‌షిప్స్, ఫీజురీయంబర్స్‌మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం బంగారు తెలంగాణగా మారుస్తుందనుకుంటే తెలంగాణలో బతుకే పోరాటంగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంకు వస్తున్న సందర్భంగా పిడిఎస్‌యు నాయకులను ముందస్తుగా నిర్భందించడం అప్రజాస్వామికమన్నారు. ఇటువంటి వైఖరి విడనాడకపోతే భవిష్యత్‌లో విద్యార్థులు తగిన విధంగా బుద్దిచెబుతారని హెచ్చరించారు. అరెస్ట్ చేసిన పిడిఎస్‌యు నగర కార్యదర్శి ఆజాద్, శ్రీకాంత్, రామకృష్ణ తదితరులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో డివిజన్ సహాయ కార్యదర్శి సాగర్, నాయకులు రశీద్, జావెద్, ఫణికుమార్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.