ఖమ్మం

విద్యా వ్యవస్థ పటిష్ఠతకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జూన్ 9: రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖామంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. గురువారం స్థానిక టిటిడిసి భవనంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ ప్రభుత్వం చేపట్టనటువంటి కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో 20కోట్ల వ్యయంతో విద్యారంగాన్ని పటిష్టం చేయనున్నామన్నారు. గత ప్రభుత్వాలు చేసిన వైఫల్యాల వల్ల విద్యా వ్యవస్థ గాడి తప్పిందని, దానిని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరిగేందుకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట పేరుతో పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచుతున్నామన్నారు. ఒక్కొక్క పాఠశాలలో సుమారు 5కంటే ఎక్కువ మంది విద్యార్థులను పెంచాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. గతేడాది 28లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తే దానిని పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. పాఠశాలల్లో వౌలిక వసతులు తాగునీరు, టాయిలెట్లు, తరగతి గదుల కల్పనకు ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నామన్నారు. జూనియర్ కళాశాలల్లో ఉచిత విద్య, పుస్తకాలు అందించటంతో పాటు మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని నూతనంగా ప్రవేశపెట్టామన్నారు. విద్యార్థుల, అధ్యాపకుల హాజరుశాతాన్ని పెంచేందుకు ఈ ఏడాది నుంచి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. డిగ్రీ, పిజి, పాలిటెక్నిక్ కళాశాలలపై దృష్టి సారించి ఎక్కడ లోటు పాట్లు లేకుండా చూస్తున్నామన్నారు. పెండింగ్‌లో ఉన్న కళాశాలల భవనాలు నిర్మించనున్నట్లు తెలిపారు. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా రాష్ట్రంలో 250గురుకులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఇందులో భాగంగా తక్షణమే వాటిని అమలు చేస్తుందన్నారు. జిల్లాలో ట్రైబల్ వెల్ఫేర్ 6, మైనార్టీ గురుకులాలు 5, ఎస్సీ డిగ్రీ కళాశాలలు బాలికలకు 2ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కేజి నుంచి పిజి ఉచిత విద్యను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
ఇదిలా ఉండగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్దీకరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించామన్నారు. అలాగే అర్హులైన పాత్రికేయుల పిల్లలకు 50శాతం రాయితీ వచ్చేలా ప్రైవేటు యజమాన్యాలను ఒప్పిస్తామన్నారు. విలేఖరుల సమావేశంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, కలెక్టర్ లోకేష్‌కుమార్, మేయర్ పాపాలాల్, ఎమ్మెల్యే జలగం వెంకట్రావు పాల్గొన్నారు.