ఖమ్మం

ఏజెన్సీ దళితుల ఆత్మఘోష ప్రభుత్వానికి పట్టదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, జూన్ 9: భద్రాచలం ఏజెన్సీలోని దళితులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు దరిచేరడం లేదని మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు అల్లాడి పౌల్‌రాజ్ పేర్కొన్నారు. ఏజెన్సీ దళితుల ఘోష ప్రభుత్వానికి పట్టడం లేదా అని ఆయన ప్రశ్నించారు. స్థానిక ఏఎంసీ కాలనీలో గురువారం జరిగిన సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్ని ప్రభుత్వాలు మారిని ఏజెన్సీ దళితుల అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉందని, 3 ఎకరాల భూ పంపిణీ పథకం ఏజెన్సీలో అమలు కాకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ పథకం అమలుకు ఏజెన్సీ చట్టాలు అడ్డుగా ఉంటే ఒక్కొ దళిత కుటుంబానికి కనీసం రూ.5 లక్షలు ఆర్థిక సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు జిల్లాలో మూలుగుతున్నా దళితుల అభివృద్ధికి ఈ నిధులు ఉపయోగించకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఏజెన్సీ దళితుల అభివృద్ధికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, నిధులు మంజూరు చేసి అభివృద్ధి, సంక్షేమ పథకాలనందించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాపుల గోపి, బసవరాజు, దిలీప్, జయరాజు, రామకృష్ణ, సామేలు, భాస్కర్, రాజు, అక్షతకుమార్, సాగర్, దుర్గారావు, ఏసు తదితరులు పాల్గొన్నారు.