ఖమ్మం

మీసేవా కేంద్రాల వద్ద రైతుల పడిగాపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోనకల్, జూన్ 9: మండల పరిధిలోని మీసేవా కేంద్రాల వద్ద రైతులు సాదా బైనామా ద్వారా ఆన్‌లైన్ చేయించుకునేందుకు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మండల పరిధిలోని కలకోట, ముష్టికుంట్ల, బోనకల్, బ్రాహ్మణపల్లి, గోవిందాపురం గ్రామాల్లో మీసేవా కేంద్రాలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదెకరాలలోపు ఉచిత రిజిస్ట్రేషన్ కోసం రైతులు తమ దరఖాస్తులతో మీసేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఆన్‌లైన్ సమస్యలను తలెత్తుతున్నాయని చెబుతూ మీసేవా కేంద్రాల యజమానులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఆన్‌లైన్ నమోదు ప్రారంభం కాకముందే జిల్లాలో ఎక్కడా లేని విధంగా దరఖాస్తుకు 300రూపాయల చొప్పున మండలంలోని మీసేవా కేంద్రాల యజమానులు రైతుల నుండి వసూలు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆన్‌లైన్ నమోదుకు 35రూపాయల రుసుము ప్రకటించినప్పటికీ మీసేవా కేంద్రాల వారు మాత్రం వంద రూపాయలు వసూలు చేస్తున్నారు. అదేమిటని రైతులు ప్రశ్నిస్తే మా దగ్గర ఇంతే మీకు ఇష్టమైతే చేయించుకోండి, లేకపోతే లేదని చెబుతున్నట్లు రైతులు వాపోతున్నారు. ఈ విషయంపై తహశీల్దార్ గుండపనేని సుదర్శనరావును వివరణ కోరగా గతంలో ఆన్‌లైన్ నమోదు ఒక్క దరఖాస్తుకు 300రూపాయలు వసూలు చేసినది తన దృష్టికి వచ్చిందని, వాటిని తిరిగి రైతులకు ఇప్పిస్తానన్నారు. ప్రభుత్వం విదించిన రుసుము కంటే ఎక్కువ వసూలు చేసిన మీసేవా కేంద్రాలపై చర్యలు తీసుకుంటామని, రైతులను ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులకు గురి చేయవద్దని ఆయన తెలిపారు.