ఖమ్మం

పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త మండలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖానాపురం హవేలి, జూన్ 10: పరిపాలన సౌలభ్యం కోసమే జిల్లాలో కొత్త మండలాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ అన్నారు. శుక్రవారం స్థానిక టిటిడిసిలో జిల్లాలో కొత్త మండలాల ఏర్పాటుకు ఆర్డీవోలు, తహశీల్దార్లు, ఎంపిడివోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలాల ఏర్పాటుకు ప్రజలు ఆమోదయోగ్యంగా ఉండేలా సూచించాలన్నారు. తహశీల్దార్లు, ఎంపిడివోలు సంయుక్తంగా పరిశీలన చేసి నివేదికలు పంపించాలన్నారు. పరిపాలన సౌలభ్యాన్ని, ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. మండలానికి దూరంగా ఉన్న గ్రామాలు వేరోక మండలానికి దగ్గరగా ఉంటే గ్రామ పంచాయతీ తీర్మానం చేయాలని, వౌలిక వసతులు, జనాభా ప్రతిపాదికన ఉండాలన్నారు. ఇదిలా ఉండగా ఫ్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా బడిబయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించేలా చూడాలన్నారు. మరుగుదొడ్లు లేని పాఠశాలల్లో 45రోజుల్లో నిర్మించేలా చూడాలన్నారు. పాఠశాలల్లో మంచినీటి సౌకర్యం, పారిశుద్ధ్య కార్యక్రమాలు గ్రామపంచాయతీ ద్వారా చేయాలన్నారు. వర్షాకాలం సంభవిస్తున్నందున మురుగు నిల్వ లేకుండా చూడాలని ఆదేశించారు.