ఖమ్మం

రైతులకు సరిపడ విత్తనాలు అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుబల్లి, జూన్ 10: రైతులకు ఖరీఫ్ సీజన్‌లో సరిపడ విత్తనాలను, క్రిమి సంహారక మందులను, ఎరువులను సకాలంలో సక్రమంగా పంపిణీ చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకెఎంఎస్) డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా పెనుబల్లి మండల కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా చేపట్టారు. అనంతరం జరిగిన సమావేశంలో రైతుకూలీ సంఘం అధ్యక్షులు పాల్వంచ డివిజన్ అధ్యక్షులు అమర్లపూడి రాము మాట్లాడుతూ ప్రస్తుతం రైతులు విత్తనాల కోసం వ్యవసాయ పనులు మానుకొని సొసైటీల చుట్టూ పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. రైతుల అవసరాలకు సరిపడ విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు మార్కెట్‌లోకి తీసుకురావటంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. సహకార సంఘాల ద్వారా పంపిణీ చేసే విత్తనాలు కూడా రైతులకు అందటం లేదన్నారు. కౌలు రైతులతో సహా పేద మధ్య తరగతి రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు పురుగు మందులు ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేసి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలని డిమాండ్ చేసారు. నకిలీ విత్తనాలు, పురుగుమందులు, ఎరువులను సరఫరా చేసే కంపెనీలపై చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ పెట్టుబడులు 18 శాతం నుండి 25 శాతానికి పెంచాలన్నారు. సమగ్ర పంటల బీమా పథకాన్ని అన్ని పంటలకు వర్తింప చేసే ప్రీమియంను ప్రభుత్వమే భరించాలన్నారు. ఖరీఫ్ సీజన్‌లో పెట్టుబడి ఖర్చులపై 50 శాతాన్ని కలిపి గిట్టుబాటు ధరలను అందించాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో బీరెల్లి లాజర్, యాటా మాధవరావు, వసుంతు వెంకటి, కొలపాక వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.