ఖమ్మం

సమస్యలపై స్పందించని రైతు సంఘాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(జమ్మిబండ), జూన్ 10: ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతున్న సమయంలో రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా పత్తి పంటను వేయవద్దని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అధికారులు ఒకవైపు ప్రయత్నిస్తూనే మరోవైపు నిర్బంధంగా పత్తి వేయవద్దని ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు. దీనిపై కొన్ని చోట్ల పోలీసులు కూడా జోక్యం చేసుకొని ప్రభుత్వ విధానాలను సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా ఖరీఫ్ సీజన్ ప్రారంభంకంటే ముందునుంచే రైతుల సమస్యలపై ఆందోళనలు చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే వామపక్ష పార్టీలకు చెందిన రైతు సంఘాలు ఈ ఏడాది మాత్రం మిన్నకుండిపోతున్నాయి. ప్రభుత్వం రైతులపై పత్తి వేయవద్దని ఒత్తిడి తెస్తున్నట్లు బహిరంగంగా తెలుస్తున్నప్పటికీ రైతుసంఘాల నేతలు స్పందించకపోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు అండగా ఉంటామని చెబుతున్న రైతు సంఘాల నేతలు ఈ ఏడాది ఎందుకు సమస్యలపై దృష్టి పెట్టడంలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు జిల్లాలోని కొన్నిచోట్ల ఆందోళనలు చేసినా విడివిడిగానే చేయడంతో పెద్దగా స్పందన రాలేదు. ప్రజా సమస్యలపై కలిసి పోరాడుతామని ఎన్నికల సమయంలో కూడా చెప్పిన వామపక్ష పార్టీల నేతలు రైతు సమస్యలపై ఈ ఏడాది ఎందుకు ఐక్య పోరాటాలకు సిద్ధం కావడంలేదని ప్రశ్నలు వస్తున్నాయి. ప్రభుత్వం రైతులపై కొన్ని పంటలు వేయవద్దని ఒత్తిడి తేవడమే కాకుండా ఎరువుల ధరలు కూడా పెంచిన నేపథ్యంలో రైతుసంఘాలు స్పందించకపోవడం పట్ల నిరసనలు కూడా వ్యక్తమవుతున్నాయి.