ఖమ్మం

రైతుల సమస్యలు పట్టని ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(మామిళ్ళగూడెం), జూన్ 25: రాష్ట్రంలో రైతుల సమస్యలను పటిటంచుకోకుండా తన స్వార్థం కోసం కెసిఆర్ ప్రభుత్వం పని చేస్తుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆరోపించారు. శనివారం తెలుగుదేశం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ రైతులకు సాగుకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పత్తికి ప్రత్యామ్నాయ పంటకు అవసరమైన అపరాల విత్తనాలను జిల్లాలో రైతులకు అందించడంలో వ్యవసాయశాఖ అధికారులు అలసత్వం వహిస్తున్నారని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత రెండు సంవత్సరాలుగా పంటలు సక్రమంగా పండక తీవ్ర కరవు పరిస్థితులను ఎదుర్కొంటున్న రైతులకు రుణాలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని, తక్షణమే 2014 పూర్తి రుణాన్ని మాఫీ చేసి, కొత్త రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వర్ధిల్లుతున్న జానపదం

ఖమ్మం(కల్చరల్), జూన్ 25: కళాకారుల నైపుణ్యాన్ని వెలికితీయడానికి కళారాధన కార్యక్రమం ఎంతగానో దోహదపడిందని సమాచారశాఖ ఏడి ముర్తుజా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభు త్వం గ్రామీణ కళాకారుల ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించాలనే తలంపుతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళారాధన కార్యక్రమ ముగింపు సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ తెలంగా ణ జానపద కళలు, సంస్కృతి, సాంప్రదాయాలకు జీవగడ్డ ఖమ్మం అడ్డా అన్నారు. ఆదివాసి సంస్కృతిలో భాగమైన రేల పాటల నుండి వెలివాడల హృదయాల్లో చాటింపు దరువై స్వచ్ఛమైన సమాచార కేంద్రమై జానపదం వర్ధిల్లుతుందన్నారు. ఆంధ్ర వలస పాలనలో వివక్షకు గురైన తెలంగాణ ప్రాంత కళలు, సాంప్రదాయాలు నేడు రాష్ట్రంలో ఆత్మగౌరవ గీతాలుగా పల్లవందుకుంటున్నాయన్నారు. జిల్లా కళాకారులు ఈ నెల 17న ప్రారంభమై నేటితో ముగిసిన కళారాధన ఉత్సవాలను ఉపయోగించుకుని తన సత్తానుచాటుకున్నారని తెలిపారు. జిల్లా కేంద్రంలో ఒక పండుగలా సాగిన ఈ కార్యక్రమంలో బిందెల కోలాటం, ప్రాచీన బైండ్లకధ, సాంస్కృతిక సారధుల సంక్షేమగీతాలు, బంజారా, కూచిపూడి, పేరణి నృత్యాలు, శివతాండవం, వీధిబాగోతం, పల్లెసుద్దులు వంటి అనేక కళా ప్రదర్శనలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. కళారాధన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జిల్లా కళాకారులకు, అతిధులకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు, వివిధ రాకాల కళాబృందాలకు, ప్రేక్షకులకు సమాచారశాఖ ఎడి, జానపద సంఘం అధ్యక్షుడు పమ్మి రవిలు కృతజ్ఞతలు తెలిపారు.

ముఖ్యమంత్రిది దొరల పాలన

ముదిగొండ, జూన్ 25: తెలంగాణ వచ్చాక ధర్నాలు లేని పాలన అందిస్తామని చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రస్తుతం దొరల పాలనను కొనసాగిస్తూ పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తున్నాడని కాంగ్రెస్ పార్టి మండల అధ్యక్షుడు కొమ్మినేని రమేష్‌బాబు,ఎంపీపీ పసుపులేటి లక్ష్మీలు అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు శనివారం ముదిగొండ బస్టాండ్ సెంటర్‌లో పెంచిన విద్యుత్ చార్జీలకు, బస్సుచార్జీలకు నిరసనగా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్లె వెలుగు ఎక్కే పేద ప్రజలకు కిలోమీటరుకు రూపాయి పెంచి సంపన్నులు ఎక్కే లగ్జరీ బస్సులకు మాత్రం 30 పైసలు పెంచటం ద్వారా ముఖ్యమంత్రికి పేద ప్రజలపై ఎంత ప్రేమ ఉందో అర్ధమవుతుందని అన్నారు. అస్సలే వర్షాలు లేక రైతులు విలవిల్లాడుతుంటే చార్జీలను పెంచి రైతులను ప్రభుత్వం వెనక్కి నెడుతోందని అన్నా రు. అనంతరం బస్టాండ్ సెంటర్ నుండి ర్యాలీ నిర్వహించి తహాశీల్దార్ కు వినతి పత్రం అందజేసేందుకు వెళ్ళ గా పోలీసులు తహాసీల్దార్ కార్యాలయంలోకి వెళ్ళకుండా కొద్దిసేపు అడ్డుకున్నారు. అనంతరం నలుగురిని మా త్రమే కార్యాలయంలోకి అనుమతించగా వారు తహసీల్దార్ రమాదేవికి వి నతి పత్రం అందజేశారు. కార్యక్రమంలోమాజీ జడ్పీటీసీ పసుపులేటి దేవేం ద్రం, యడవల్లి ఎంపీటీసీ కందిమళ్ళ వీరబాబు, సర్పంచ్‌లు ఉసికల సుధారాణి, ఉరిమళ్ల అరవింద, బిచ్చాల భి క్షం, నాయకులు ఉసికల రమేష్, రాం బాబు, బుచ్చయ్యలు పాల్గొన్నారు.

రామయ్యకు స్వర్ణ తులసీ పూజలు
భద్రాచలం, జూన్ 25: శ్రీ సీతారామచంద్రస్వామికి శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. రామయ్యకు స్వర్ణతులసీ పూజలు చేశారు. ఉదయం గర్భగుడిలో స్వామికి విశేష ఆరాధనలు జరిగాయి. సుప్రభాత సేవ అనంతరం బాలభోగం సమర్పించి స్వర్ణతులసీ పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్సవమూర్తులను ప్రాకారమండపానికి తీసుకెళ్లి నిత్యకల్యాణం చేశారు. భక్తులు భక్తిప్రపత్తులతో స్వామివారి కల్యాణం నిర్వహించారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు. సాయంకాల ఆరాధనల అనంతరం దర్బారు సేవ జరిగింది

.రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం

ఖమ్మం(స్పోర్ట్స్), జూన్ 25: రాష్ట్ర పాఠశాలల స్థాయి అండర్-15 క్రికెట్ పోటీలు సర్ధార్ పటేల్ స్టేడియంలో శనివారం ప్రారంభమయ్యాయి. పోటీలకు ముఖ్య అతిధిగా వచ్చిన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ బ్యాటింగ్ చేసి ప్రారంభించారు. కొలనపాక సునిల్ బౌలింగ్ చేయగా మొదటి మ్యాచ్‌ను కరీంనగర్, ఖమ్మం జట్ల మధ్య జరిగింది. ఈ సందర్భంగా వారు క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. కరీంనగర్-ఖమ్మం జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కరీనంగర్ టాస్ గెలిచి పీల్డింగ్ ఎంచుకోగా ఖమ్మం జట్టు బ్యాటింగ్ చేసింది. ఖమ్మం జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేశారు. జట్టులో జశ్వంత్ 67 పరుగులు, ప్రియదర్శన్ 19 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన కరీంనగర్ జట్టు 19.5 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసి విజయం సాధించింది. కరీంనగర్ జట్టులో లక్ష్మణ్‌మూర్తి 38 బంతుల్లో 71 పరుగులు చేశారు. బాబ్జి 17 పరుగులు చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో క్యాట్ సెక్రెటరీ సునీల్‌బాబు మాట్లాడుతూ నేషనల్ స్కూల్ క్రికెట్ టాలెంట్ టెస్ట్‌లో భాగంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ టోర్నీలో ఖమ్మం, నిజామబాద్, అదిలాబాద్, కరీంనగర్ జట్లు పాల్గొంటున్నాయన్నారు. మూడు రోజుల పాటు పోటీలు జరుగుతాయని, వచ్చే నెల 1,2 తేదీల్లో సెమి, ఫైనల్స్ పోటీలు ఉంటాయన్నారు. రంగారెడ్డిలో జరిగే టోర్నమెంట్‌లో సెమీస్, ఫైనల్స్‌కు వచ్చిన జట్లు ఖమ్మంలో జరిగే పోటీల్లో పాల్గొంటాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చావా నారాయణరావు, పాలకూర్తి పాపారావు, ఉపేందర్, రాజేష్‌టక్కర్, సుధాకర్, కర్నాటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మారుతండ్రి వేధింపులతో యువతి ఆత్మహత్య

గార్ల, జూన్ 25: పెంచుకున్న తండ్రి కసాయిగా మారి మానసిక వేధింపులకు గురిచేయడంతో మానసిక వేదనకు గురై ఒక యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం మండల పరిధిలోని వికలాంగుల కాలనీలో చోటు చేసుకుంది. గార్ల పోలీసుల కథనం ప్రకారం వికలాంగుల కాలనీలో నివాసముంటున్న బొర్రా ప్రియాంక(19) అఘాయిత్యానికి పాల్పడింది. బొర్రా మంజులతో మెదక్ జిల్లాకు చెందిన వ్యక్తితో వివాహం జరగగా ప్రియాంక జననం తర్వాత అతను ఆమెను వదిలి వెళ్ళిపోగా మంజుల గార్లకు చెందిన కృష్ణారెడ్డిని వివాహం చేసుకుంది. వీరి వద్ద ప్రియాంక కాలం వెల్లబుచ్చుతుండగా శుక్రవారం భార్య, భర్తలు డబ్బు విషయంలో గొడవ పడుతుండగా ప్రియాంక అడ్డుపోయింది. దీంతో కృష్ణారెడ్డి ప్రియాంకను అనరాని మాటలు అనడంతో పాటు కూతురు అనే విచక్షణ లేకుండా వేధింపులు చేయడంతో మానస్థాపం చెంది క్రిమి సంహారక మందు తాగింది. విషయం తెలుసుకున్న కుటుంబీకులు హుటాహుటిన గార్ల ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకురాగా ఆమె పరిస్థితి విషమంగా మారడంతో వరంగల్ జిల్లా మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ మేరకు మంజుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గార్ల స్టేషన్ హౌజ్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు తెలిపారు. కూతురు వరుసైన ప్రియాంకను వేధింపులకు గురిచేసి ఆమె ఆత్మహత్యకు కారకుడైన కృష్ణారెడ్డిని కఠినంగా శిక్షించాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు.
భద్రాచలం కేంద్రంగా ఆదివాసి జిల్లాను ఏర్పాటు చేయాలి
ఖమ్మం(ఖిల్లా), జూన్ 25: భద్రాచలం-బూర్గంపాడు కేంద్రంగా ఆదివాసి జిల్లాను ఏర్పాటు చేయాలని సి పిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్ చేశారు. శనివారం రామనర్సయ్య వి జ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడు తూ ఖమ్మం జిల్లాలో ఆదివాసిల జనా భా 6 లక్షలకు పైగా ఉన్నదని, 1/70 చట్టం, ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో 22 మండలాలు ఉన్నాయని, ఆదివాసిలు అన్నివిధాలా వెనుకబడి ఉన్నారని, వీరి అభివృద్ధిపట్ల పాలకులకు చిత్తశుద్ధి లేదన్నారు. నిధులు కేటాయించినప్పటికీ ఖర్చుచేయడం లేదని, ఎంతోకొం త ఖర్చు చేసినప్పటికీ అధికారులు, దళారులే కాజేస్తున్నారని ఆరోపించారు. ఆదివాసిల అభివృద్ధికి ప్రత్యేక జిల్లా ఎంతో అవసరమని, దీనికి భద్రాచలమే అనువైన ప్రాంతమని స్పష్టం చేశారు. తమ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 28న భద్రాచలంలో సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.