ఖమ్మం

ఉత్తర ద్వారం వద్ద కూలిన గోడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, జూన్ 27: గడిచిన 24 గంటలుగా భద్రాచలంలో కురుస్తున్న కుండపోత వర్షాలకు శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉత్తరద్వారం సమీపంలోని 40 ఏళ్లకాలం నాటి ప్రహరీ కుప్పకూలింది. భారీగా వర్షం పడినప్పటికీ అర్థరాత్రి వేళ కావడం, భక్తులు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న వెంటనే దేవాదాయ, ధర్మాదాయ శాఖ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు, స్థపతి వల్లీ నాయగన్, ఈఓ తాళ్లూరి రమేశ్‌బాబులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డిఇ వేగిశ్న రవీందర్‌రాజుతో కలిసి గోడ కూలిన ప్రాంతాన్ని సందర్శించారు. కేవలం ఇటుకలు, మట్టితో కట్టిన పురాతన గోడ కావడం, అక్కడ నీటి పైపులైన్ల లీకులకు వర్షాలు తోడవడం వల్లే కూలినట్లుగా ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే కూలిన గోడ సమీపంలోనే ఐదేళ్ల క్రితం ఆజాద్ ఈఓగా ఉన్న సమయంలో భక్తుల కోసం ఉత్తర ద్వారం వైపు రూ.10లక్షలతో నిర్మించిన ఫుట్ బ్రిడ్జి ఉంది. దీనికి కూడా ప్రమాదం పొంచి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదాన్ని నివారించేందుకు అక్కడ తిరిగి గోడను కాంక్రీట్‌తో నిర్మించాల్సి ఉందని సీఈ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈఓ రమేశ్‌బాబుకు సూచించారు. ప్రతిపాదనలు తయారు చేసి కమిషనర్ అనుమతి తీసుకుని యుద్ధ ప్రాతిపదికన గోడ పునర్నిర్మించాలని ఆదేశించారు.

దివ్య భద్రాద్రికి ప్రణాళికలు
* దేవాదాయశాఖ సిఇ వెంకటేశ్వరరావు
భద్రాచలం, జూన్ 27: శ్రీరామదివ్యక్షేత్రం అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దివ్య భద్రాద్రి కార్యాచరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు దేవాదాయ ధర్మాదాయశాఖ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు వెల్లడించారు. స్థ్తపతి వల్లీ నాయగర్, ఈవో రమేష్‌బాబు, డీఈ రవీంద్రరాజులతో కలిసి సోమవారం ఆయన రామాలయం పరిసర ప్రాంతాల్లో దేవస్థానం స్థలాలను పరిశీలించారు. ఆలయం అభివృద్ధితో పాటు యాత్రికులకు కల్పించాల్సిన వసతులపై దృష్టి సారించామని ఆయన తెలిపారు. తానీషా వెనుక 40 సెంట్లు, శిల్పినగర్‌లో ఎకరం, రంగనాయకుల గుట్ట తదితర ప్రాంతాల్లో స్థలాలను పరిశీలించామని, భక్తుల వసతికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఆలయంలో వాస్తు ప్రకారం చేపట్టాల్సిన పనులు, ఇతర వైదికపరమైన సలహాలు తీసుకున్నామని, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శికి వీటిని అందిస్తామని తెలిపారు.