ఖమ్మం

మండలంలో భారీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుమ్ముగూడెం, జూన్ 28: దుమ్ముగూడెం మండలంలో గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మండల పరిధిలోని ధర్మారం గ్రామం వద్ద పార్కెలవాగు పొంగడంతో ఆ గ్రామానికి మండల కేంద్రానికి సంబంధాలు తెగిపోయాయి. పార్కెలవాగు నడుంలోతు పారడంతో ఆ గ్రామ ప్రజలు గ్రామం నుంచి బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మంగళవారం ధర్మారం గ్రామం పాఠశాల హెచ్‌ఎం తన విధులకు నడుం లోతు నీరులో వాగు ప్రవహిస్తుండగా దాటి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్నో సంవత్సరాలుగా ఆ వాగుపై వంతెన మంజూరు చేయాలని ప్రజలు విన్నవించారు. ఇటీవల ఆ వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కానీ టెండర్లు కాకపోవడంతో ఆ పనులను ప్రారంభించలేదు. అలాగే మండలంలోని తూరుబాక సీతవాగు, గుబ్బలమంగి వాగులో వర్షం నీరు చేరడంతో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలో భారీ వర్షాలకు పలు వరిమళ్లలో నీరు నిలిచింది. దీంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.