ఖమ్మం

జ్ఞాన తెలంగాణ నిర్మాణానికే ‘పల్లెకు పుస్తకం’ చేపట్టాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కారేపల్లి, జూలై 4: జ్ఞాన తెలంగాణ నిర్మాణానికే ప్రతి గడపకు పుస్తకాన్ని తీసుకెళ్ళే లక్ష్యంలో భాగంగానే పల్లెకు పుస్తకం కార్యక్రమం చేపట్టినట్లు బుక్‌ఫెయిర్ అధ్యక్షుడు జూలూరి గౌరిశంకర్, వైరా ఎమ్మెల్యే మదన్‌లాల్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని రొట్టమాకిరేవుగ్రామంలో హైదరాబాద్ బుక్‌ఫెయిర్ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్లెకు పుస్తకం కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పుస్తకాలపై అవగాహన పెంచటం, మంచి పుస్తకాలను చదివించటం ద్వారా సామాజిక స్పృహను తట్టి లేపి జ్ఞాన నిర్మాణ తెలంగాణానికి పునాదులు వేసేందుకు దోహదపడుతుందన్నారు. వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచానికి నైతిక విలువలు, సామాజిక చింతనతో కూడిన సామూహిక విలువలు ఎంతో ముఖ్యమైనవన్నారు. పది మంచి పుస్తకాల ద్వారానే విలువల ప్రపంచం సృష్టించబడుతుందన్నారు. కులమతాలకు ఆధిపత్యాల సంఘర్షణల నుంచి ప్రపంచాన్ని కాపాడాలంటే పుస్తకాలే అందుకు సాధనాలన్నారు. అనునిత్యం సృష్టించబడుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సమాజాభివృద్ధికి తోడ్పడి సమాజం అభివృద్ధి పథంలో దూసుకెళ్ళాలంటే మంచి పుస్తకాలే దారి చూపుతాయన్నారు. పుస్తక పఠనంపై అభిరుచి కలిగించేందుకు అవగాహన కార్యక్రమాలు హైదరాబాద్ బుక్‌ఫెయిర్ చేపట్టిందన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిగా రొట్టమాకిరేవు పల్లెను ఎంచుకోవటం ఆనందించదగ్గ విషయమన్నారు. దీనికి ఈ గ్రామానికి చెందిన కవి యాకుబ్ కృషి ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో కవులు ప్రసేన్, డాక్టర్ రాఘవులు, స్థానిక సిఐ దోమల రమేష్, ఎస్‌ఐ రవికుమార్ పాల్గొన్నారు.