ఖమ్మం

సమస్యలపై నిలదీసిన ప్రజాప్రతినిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూలూరుపాడు, జూలై 4: మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పాలకమండలితో పాటు, అధికారులను ప్రజా ప్రతినిధులు నిలదీశారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం పలు పథకాల ద్వారా ప్రభుత్వం మంజూరీ చేస్తున్న నిధులను ఆయా పాలకమండలి సభ్యులకు తెలుపకుండానే ఇష్టార్జ్యాంగా వినియోగిస్తున్నారని మాచినేనిపేటతండా పంచాయతీ సర్పంచ్ లకావతు గిరిబాబు ఎంపిపితో వాగ్వివాదానికి దిగారు. ఇంతే కాకుండా పంచాయతీల వారీగా నిధుల కేటాయింపులో రాజకీయం చేస్తుండటంతో పారదర్శకత లోపిస్తుందని పలువురు ప్రజా ప్రతినిధులు ఆందోళన చేశారు. గిరిజన సంక్షేమం కోసమే ప్రత్యేకంగా ఉన్న ఐటిడిఏ నిధులను కూడా అర్హులకు అందకుండా పక్కదారి పట్టిస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతే కాకుండా చెరవుల అభివృద్ది కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయను కూడా మండలంలో కమీషన్ కాకతీయగా మార్చారని సొసైటీ ఛైర్మన్ పోలుదాసు కృష్ణమూర్తి, పాపకొల్లు ఎంపిటిసి రోకటి సురేష్, సర్పంచ్ గిరిబాబులు ధ్వజమెత్తారు. పాపకొల్లు పంచాయతీ కొత్తూరు శనగచెరువు, మాచినేనిపేటతండా ఈదులకుంట చెరువుల్లో జరిగిన పనుల్లో నాణ్యత లోపించిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో పారిశుద్ద్య చర్యలతోపాటు, పూర్తి స్థాయిలో ప్రభుత్వ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజా ప్రతినిధులు సమావేశంలో కోరారు. ఎంపిపి చిట్టిబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జడ్పీటిసి శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, ఎంపిటిసి సాయిల నాగేశ్వరరావు, సర్పంచ్‌లు ఈసాల వెంకటేశ్వర్లు, భూక్యా జ్యోతి, పాయం వెంకటరమణ, కట్రం మోహన్‌రావు, ఎంపిడివో బానోతు భారతి, తహశీల్దారు రవికుమార్, ట్రాన్స్‌కో ఇంజనీరు ప్రతాప్ కుమార్, హౌజింగ్, ఆర్‌డబ్ల్యూఎస్, మండల ఇంజనీర్లు వెంకటేశ్వరరావు, ఆర్.కె పద్మ, వెంకటేశ్వర్లు, ఎంఈవో జి.వెంకట్ పలుశాఖలకు చెందిన అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.