ఖమ్మం

వసంతోత్సవానికి అంకురార్పణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, మార్చి 22: శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో వసంతోత్సవాలకు మంగళవారం రాత్రి అంకురార్పణ జరిగింది. మంగళవాయిద్యాలతో గోదావరికి వెళ్లి అర్చకులు తీర్థబిందెను తెచ్చారు. శ్రీసీతారామచంద్రస్వామికి సాయంకాల అరాధన చేశారు. అనంతరం రాజదర్బారు సేవ నిర్వహించారు. యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నేడు శ్రీసీతారామచంద్రస్వామిని పెళ్లికొడుకును చేయనున్నారు. ఏప్రిల్ 15వ తేదీన నిర్వహించే సీతారాముల కల్యాణానికి తలంబ్రాలను కలపనున్నారు. ఈ సందర్భంగా మణుగూరు నుంచి భక్తులు గోటితో ఒలిచిన తలంబ్రాలను పాదయాత్రగా భద్రాచలం తీసుకొస్తున్నారు. హోళీ వేళ వసంతోత్సవం జరుపుకోవడం భద్రాద్రి రామునికి ఆనవాయితీ. ఉదయం 8.30 గంటల సమయంలో తలంబ్రాలను కలపనున్నారు. చిత్రకూట మండపంలో స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు.