ఖమ్మం

చట్టానికి లోబడి భూసమస్యల పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూలూరుపాడు, మార్చి 22: చట్టాలకు లోబడి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న భూసమస్యలకు సత్వర పరిష్కారం చూపేవిధంగా చర్యలు చేపడ్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ డి.దివ్య తెలిపారు. జూలూరుపాడుకు చెందిన సయ్యద్ జాన్‌మియా భూసమస్యను పరిష్కరించాలంటూ ఎంతో కాలంగా కలెక్టర్ కోర్టును ఆశ్రయించటం జరుగుతున్న నేపధ్యంలో మంగళవారం జెసి క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చారు. ఈసందర్భంగా జెసి విలేఖరులతో మాట్లాడారు. జూలూరుపాడుకు చెందిన సయ్యద్ జానిమియా కుటుంబం తరాలుగా నివాసముంటుందని, అయితే అప్పటి నుంచి జూలూరుపాడు రెవిన్యూ పరిధిలోని 342 సర్వే నెంబరులో 7.11 ఎకరాల వ్యవసాయ భూమి 1961 నుంచి రెవిన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా నమోదై ఉందన్నారు. అంతకు ముందు జాన్‌మియా వంశీకులకు చెందిన పట్టా భూమిగా ఉండగా ఆతర్వాత ప్రభుత్వ భూమిగా రెవిన్యూ రికార్డుల్లో నమోదు జరిగిన నేపధ్యంలో అట్టి భూమిపై ఎటువంటి ఆధారాలు లేకుండా పోయిన జాన్‌మియా కుటుంబం నష్టపోతుందన్నారు. ఎంతో కాలంగా జాన్‌మియా న్యాయం కోరుతుండటంతో విచారణ చేపట్టడం జరిగిందన్నారు. క్షేత్ర స్థాయిలో భూస్వరూపంతో పాటు, పరిసర భూములకు చెందిన రైతులను జెసి విచారించి, చట్ట ప్రకారం న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవటం జరుగుతుందని జెసి తెలిపారు. అనంతరం జూలూరుపాడు కప్పలకుంట చెరువులో అభివృద్ది పనులకు కొందరు ఆటంకం కల్గిస్తున్నారని, పనులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలంటూ ఎంపిటిసి సాయిల నాగేశ్వరరావు కోరగా, అభివృద్ది పనులకు అటంకం కల్గించే వ్యక్తులపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని తహశీల్దారును జెసి ఆదేశించారు. ఆమె వెంట ల్యాండ్ అండ్ సర్వే అసిస్టెంట్ డైరక్టర్ రాము, తహశీల్దారు కోట రవికుమార్, రెవిన్యూ ఇన్స్‌పెక్టర్ నర్సింహారావు, విఆర్వో భీక్లూలు ఉన్నారు.