ఖమ్మం

దమ్మున్న సిఎం కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇల్లెందు, జూలై 10: తెలంగాణలోని ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిన అనంతరమే వచ్చే ఎన్నికలలో ఓట్లు అడుగుతామని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారని రాష్టమ్రంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఇల్లెందు మండలం సుదిమళ్ళ పంచాయతీ సుభాష్‌నగర్ ఏరియాలో మిషర్ భగీరథ పనులకు సంబంధించి శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈసందర్భంగానే డిగ్రీ కళాశాల, ఐటిసి భవనం ఆవరణలో మంత్రి మొక్కలునాటారు. అనంతరం జరిగిన విలేఖరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గత చరిత్రలో ఏముఖ్యమంత్రి అంతటి సహసం చేయలేదని, తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తున్నందునే మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ వంటి ప్రతిష్టాత్మక పథకాలను ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్దిష్టంగా అమలుచేయిస్తున్నారని అన్నారు. నీళ్ళు ఇచ్చిన తరువాతనే ఓట్లు అడుగుతామని ఆయన ప్రకటించడం అంతటి దమ్ము ఎవరికి ఉంటుందని మంత్రి తుమ్మల అన్నారు.
రూ 3600కోట్ల వ్యయంతో ఖమ్మంజిల్లాలోని ప్రతి ఇంటికి నీరు అందిస్తామన్నారు. యుద్దప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని అన్నారు. అన్నివర్గాల ప్రజలకు నీళ్ళు అందించడంతో పాటు రైతాంగానికి తాగునీటిని అందించే విషయంలో ఎన్ని అడ్డంకులు, ఆటంకాలనైనా ఎదుర్కొని పనులు పూర్తిచేయించేందుకు తెలంగాణ ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్నారు. హరితహారం కార్యక్రమం యజ్ఞంలా సాగాలని, ప్రతిఒక్కరు అందులో భాగస్వామ్యం కావాలని కోరారు. ప్రతిఇంట మొక్కలు నాటాలని సూచించారు. పట్టణ, మండల పరిధిలోని పలుప్రాంతాలలో మొక్కలు నాటించే విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వశాఖల అధికారులు చొరవ తీసుకోవాలని మంత్రి సూచించారు. ఇల్లెందు నుండి మిషన్ భగీరధపథకం ద్వారా ఏడుమండలాల ప్రజలకు నీటిని అందిస్తామని మంత్రి తెలిపారు. ఇల్లెందు పట్టణం, మండలంతో పాటు టేకులపల్లి, కారేపల్లి, గార్ల, బయ్యారం, కామేపల్లి మండలాల పరిధిలోని ప్రతి ఇంటికి నీటిని అందింపచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మంత్రి పర్యటన కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, డిసిసిబి చైర్మన్ మువ్వా విజయబాబు, జడ్పీచైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, స్థానిక సర్పంచ్ నాగరత్తమ్మ, పలువురు ప్రజాప్రతినిధులు, మిషన్ భగీరధ అధికారులు, టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించిన సందర్భంగా పోలీస్ అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. డిఎస్పీ ఆర్ వీరేశ్వరరావు, సిఐ నరేందర్ పర్యవేక్షణలో బందోబస్తు చర్యలు చేపట్టారు.