ఖమ్మం

ప్రశాంతంగా టెన్త్ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేలకొండపల్లి, మార్చి 22: జిల్లాలో పదోతరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని జడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, జిల్లా విద్యాశాఖాధికారి రాజేష్ వెల్లడించారు. మంగళవారంలోని నేలకొండపల్లి ప్రభుత్వ ఉన్నతపాఠశాలలోని పరీక్షా కేంద్రాన్ని వారు పరిశీలించారు. పరీక్షా కేంద్రంలోని వసతులను పరిశీలించారు. ఈ సందంర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. వచ్చే జూన్ 13వ తేదీ నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 185 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, 37,979 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు సూచించారు. అలాగే 11 ప్లైయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశామని, అవసరమైన చోట 33 సిట్టింగ్ టీంలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన వౌళిక వసతులను ఏర్పాటు చేశామన్నారు. నూతన విద్యా సంవత్సరానికి గాను జిల్లా వ్యాప్తంగా 13 లక్షల పుస్తకాలు అవసరం కాగా ఇప్పటి వరకు 5 లక్షల పుస్తకాలను మండల కేంద్రాలకు పంపించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి ఎంపిపి నందిగామ కవితరాణి, ఎంఇవో పురుషోత్తమరావు, గ్రామ సర్పంచ్ వంగవీటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.