ఖమ్మం

భక్తి పారవశ్యంతో రామకోటి నిమజ్జనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, జూలై 15: తొలి ఏకాదశి..శయన ఏకాదశి హిందువులకు ఎంతో పరమ పవిత్ర పర్వం. భక్తి పారవశ్యం నింపుకుని సర్వత్రా విష్ణుసహస్ర నామ పారాయణాలతో భక్తులు ఎంతో ఉత్సాహంగా ఈ ఉత్సవాన్ని శుక్రవారం నిర్వహించుకున్నారు. దక్షిణ అయోధ్య భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో భక్తులు ఆనంద పరవశులై స్వామికి అభిషేకాలు చేశారు. ఆలయంలో తెల్లవారుఝామున స్వామికి తీర్ధబిందెను తెచ్చి విశేష తిరుమంజనం చేశారు. స్వామికి బాలభోగం సమర్పించారు. ఉత్సవమూర్తులను ప్రాకార మండపానికి తీసుకొచ్చి నిత్యకల్యాణం, సహస్రనామార్చనలు, క్షేత్ర మహత్యాలు నిర్వహించారు. శుక్రవారం సందర్భంగా లక్ష్మీతాయారు అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన చేశారు. అనంతరం 500 మంది మహిళలు వికాసతరంగిణి, రామసేవా సమితి, కన్యకా పరమేశ్వరి, బీపీఎల్ మహిళలు 13 సార్లు విష్ణుసహస్ర పారాయణాలు చేశారు. అనంతరం సంవత్సర కాలంగా స్తూపాల్లో, బాండాగారాల్లో నిత్య ధూప, దీప, నైవేద్యాలతో భద్రపరిచిన 4 రాష్ట్రాలకు చెందిన భక్తులు రాసిన రామకోటి పుస్తకాలను నిమజ్జనం చేసే ఆధ్యాత్మిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వాటిని రెండు లారీ వాహనాల్లో ఉంచి వాటికి విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం చేసి ప్రోక్షణ చేశారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈఓ తాళ్లూరి రమేశ్‌బాబు వాహన చోదకుల కుటుంబాలకు శేషమాలికలు, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేసి సన్మానం చేశారు. అనంతరం మహిళల కోలాటాలు, బాల వేదపండితుల వేదమంత్రోచ్ఛారణలు, రామనామ స్మరణలతో భద్రగిరిలో శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. రామవారధిపైకి తీసుకెళ్లి అక్కడ ప్రధానార్చకులు, స్థానాచార్యులు గోదారమ్మకు గంగా పూజలు చేశారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, పట్టువస్త్రాలు సమర్పించి నైవేద్యంగా చక్కెరపొంగలి ఇచ్చారు. ఈ సందర్భంగా రామకోటి పుస్తకాలను ఈఓ శిరస్సుపై ధరించి రామనామ స్మరణ చేస్తూ గోదావరిలో రామకోటిని నిమజ్జనం చేశారు. భక్తులు కూడా వాటిని నిమజ్జనం చేసి పరవశించారు. తీర్ధప్రసాదాలు స్వీకరించారు. సూర్యాస్తమయం వేళ రామకోటి నిమజ్జనం భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. పట్టణ ఎస్సై కరుణాకర్, ట్రాఫిక్ ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శోభాయాత్రకు, రామకోటి నిమజ్జనానికి పోలీసులు బందోబస్తు చేపట్టారు.