ఖమ్మం

భూస్వాములు, కాంట్రాక్టర్ల కోసమే టిఆర్‌ఎస్ ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోనకల్, జూలై 17: భూస్వాములు, కాంట్రాక్టర్లు, ఫ్యాక్షనిస్టుల కోసమే టిఆర్‌ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని, పేద ప్రజల సంక్షేమాన్ని కెసిఆర్ సర్కార్ గాలికి వదిలేసిందని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. మండల పరిధిలోని రావినూతల గ్రామ సర్పంచ్ షేక్ వజీర్ నివాసరంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేఖరులతో భట్టి మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి ఇతర పార్టీల నుంచి టిఆర్‌ఎస్‌లో చేర్పించుకునే పనిగా కెసిఆర్ తమ పార్టీ నాయకులతో పని చేయిస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాల్లో నిత్యవసర వస్తువులు ప్రజలకు సక్రమంగా అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు రాక లబ్ధిదారులు అప్పులపాలై దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. బిసి, ఎస్టీ, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు, రుణమాపీ అమలు, డబుల్ బెడ్‌రూం ఇళ్లకు నిధులు కేటాయించకుండా ప్రజలను మోసగిస్తూ కెసిఆర్ కాలం వెల్లదీస్తున్నారన్నారు. రెండు సంవత్సరాల కాలంలో డ్వాక్ర మహిళలకు పావల వడ్డీ రాక ఇబ్బందులు పడుతుంటే పట్టించుకునే నాధుడే లేడన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై ఒత్తిడి చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. చింతకాని మండలం రామకృష్ణాపురం కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడిని టిఆర్‌ఎస్‌లో చేరాలని ఒత్తిడి చేస్తూ ఆ పార్టీలోకి వెళ్ళనందుకే ఆయన ఇంటిపై ఏసిబి దాడులు జరిపారని ఆరోపించారు. ఇటువంటి సంస్కృతి టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి సరైనది కాదన్నారు.ఇప్పటికైన అది మానుకోవాలన్నారు. అధికారులు ప్రభుత్వ పనులు చేయాలి తప్పా అధికారంలో ఉన్న పార్టీల కోసం పని చేస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అలా చేసిన అధికారులను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి వదలదన్నారు.
ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు ఐతం సత్యం, బండి మణి, పైడిపల్లి కిషోర్‌బాబు, సుబ్బలక్ష్మి, దుర్గారావు, అర్లప్ప, వెంకయ్య, సర్పంచ్‌లు ప్రేమ్‌కుమార్, శ్రీలక్ష్మి పాల్గొన్నారు.