ఖమ్మం

మహాప్రయత్నానికి చేయి చేయి కలుపుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేలకొండపల్లి, జూలై 17: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన హరితహరం కార్యక్రమానికి ప్రతి ఒక్కరు చేయి చేయి కలిపి పచ్చని తెలంగాణకు పాటుపడుదామని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, హరితహరం కింద మొక్కల నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. మండలంలోని కోంగర గ్రామంలో రూ.1.65కోట్లతో నూతనంగా నిర్మించనున్న బిటి రోడ్డుకు మంత్రి శంకుస్థాపన చేసారు. అలాగే శంకరగిరితండ నుండి కట్టకమ్మతండ వరకు రూ.1.65కోట్లతో నూతనంగా నిర్మించనున్న బిటి రహదారికి శంకుస్థాపన చేసారు. అనంతరం నేలకొండపల్లి గ్రామ సమీపంలో గల బాలికల గురుకుల పాఠశాల నందు హరితహరం కార్యక్రమంలో భాగంగా మంత్రి మొక్కను నాటారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ వాతవరణంలో నానాటికి వేగంగా పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు బారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం హరితహరం కార్యక్రమంను పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టిందన్నారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 4,5 సంవత్సరాల కాలంలో 240కోట్ల మొక్కలను నాటేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్దం చేసిందన్నారు. విటిలో భాగంగా ప్రతి సంవత్సరం 40 కోట్ల మొక్కలు నాటించి వాటి సంరక్షించే భాద్యతను ప్రతి ఒక్కరు చేప్పటాలని అన్నారు. రైతులకు, ప్రజలకు అవసరమైన మొక్కలను అందించేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు. ఇంటి ఆవరణంలో నాటే మొక్కలకు వారి కుటుంబ సభ్యుల పేర్లు పెట్టి వాటిని పెంచేందుకు బాధ్యత తీసుకోవాలని కోరారు. నీటి వసతి లేని ప్రదేశాలలో కూడా డ్రిప్ ఇరిగేషన్ పద్దతి ద్వార మొక్కలను పెంచుకోవచ్చాన్నారు. ముంధు చూపుగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహరం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగాస్వాములై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి బాలసాని లక్ష్మినారాయణ, డిఎప్‌వో తిరుమలారావు, డిఇఒ నాంపల్లి రాజేష్, నేలకొండపల్లి మండల ప్రత్యెకధికారి మోహన్‌రావు, ఎంపిడిఓ ఆళ్ళశ్రీనివాసరావు,ఎంఆర్‌ఒ కడవర్తి వెంకటేశ్వరరావు, ఎంపిపి నందిగామ కవితరాణి, నేలకొండపల్లి సర్పంచ్ వంగవేటి నాగేశ్వరరావు,ఎంఇఓ పురుషోత్తరావు, వ్యవసాయధికారి నారాయణరావు, ఇఒఆర్‌డి ప్రభాకర్‌రావు. పాఠశాల ప్రిన్సిపాల్ పాల్గొన్నారు.