ఖమ్మం

ఇంటింటికీ మొక్కలు అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామేపల్లి, జూలై 17: ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, ఇంటింటా మొక్కలు అందించాలని జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ లోకేష్‌కుమార్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని కొత్తలింగాల, తాళ్ళగూడెం గ్రామాలలో సామాజిక అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలను కలెక్టర్ లోకేష్‌కుమార్, ఐటిడిఏ పిఓ రాజీవ్‌గాంధీ హన్మంతు సంయుక్తంగా అకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా నర్సరీల్లో ఉన్న మొక్కల వివరాలు, నర్సరీల ద్వారా మండలానికి సరఫరా చేసిన మొక్కలు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటికి మొక్కలు అందించాలని, అదే విధంగా ప్రతి ఇంటా మరుగుదొడ్డి నిర్మించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని వారిని ఆదేశించారు. మరుగుదొడ్డి లేని ఇంటికి నిత్యవసర వస్తువుల సరఫరా, తదితర ప్రభుత్వ పథకాలను నిలిపివేయాల్సిందిగా ఆదేశించారు. మండలంలో అధికంగా టేకు, మామిడి తదితర మొక్కలు ఎక్కువగా అడుగుతున్నట్లు అధికారులు వివరించగా మరో విడతలో వాటిని అందించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులకు వివరించారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యత సైతం విధిగా నిర్వహించాల్సిందిగా అధికారులకు సూచించారు. అనంతరం మండలంలో చేపట్టిన హరితహారం వివరాలు, సరఫరా చేసిన మొక్కలతో పాటు దీపం పథకం, ప్రభుత్వ పథకాల నిర్వహణ తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు పకడ్భందీగా అమలు చేయాలని, లక్ష్యాలను చేరుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ లక్ష్మణస్వామి, ఎంపిడిఓ జివి రమణ, కార్యదర్శులు నర్సింహరావు, ఎంసిఓ రమేష్, విసిఓలు పాల్గొన్నారు.