ఖమ్మం

సేవాగుణం అలవరచుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(మామిళ్ళగూడెం), జూలై 17: ప్రతి ఒక్కరు నిసహాయులకు సహాయం చేసే గుణం అలవరుచుకోవాలని ఇంటిలిజెన్స్ డిఎస్పీ బాలకిషన్, ప్రముఖ వైద్యులు రాజేష్‌గార్గెలు అన్నారు. ఆదివారం స్థానిక కెమిస్ట్ భవన్‌లో ఖమ్మం నగర కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తలసీమియ వ్యాధిగ్రస్థ పిల్లల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ప్రారంభించిన వారు మాట్లాడుతూ జిల్లాలో 250 మంది పిల్లలు తలసీమియ వ్యాధితో బాధపడుతున్న వారికి మేము సైతం అండగా ఉంటామని ముందుకు వచ్చిన మెడికల్ అసోసియేషన్ సేవా ధృక్పథం చాల అభినందనీయమన్నారు. వీరి సేవాభావం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా ఉండాలని కాంక్షించారు. తలసీమియ వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఇలా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి చేయూతనివ్వడం అభినందనీయమన్నారు. ఇప్పటికే నగరంలో శివ బ్లడ్ బ్యాంక్ ఈ వ్యాధిగ్రస్థ పిల్లలకు ఉచితంగా సెలైన్‌వాష్ చేసి రక్తాన్ని అందిస్తుందని, ఇలా ఈ పిల్లలకు సేవచేసేందుకు సంకల్ప స్వచ్ఛంద సంస్థతో కలిసి ముందుకు వస్తున్న వారందరికి ధన్యవాదాలు తెలిపారు. రక్తదానంతో ప్రమాదంలో ఉన్న వారి ప్రణాలను కాపాడవచ్చన్నారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ చేతులమీదుగా ఉత్తమ సేవా ప్రతిభా అవార్డు పొందిన డిఎస్పీ బాలకిషన్, డాక్టర్ రాజేష్‌గార్గె లను అసోసియేషన్ సభ్యులు సన్మానించారు. ఈ శిబిరంలో 62 మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ బాధ్యులు జనార్ధన్‌రావు, నాగేశ్వరరావు, శ్రీరామమూర్తి, ఐ హరగోపాల్, బివి నాగభూషణ్, సుధాకర్‌రావు, సంకల్ప సభ్యులు పి రవిచందర్, మరికంటి నాగేశ్వరరావు, అనిత, నరేష్, ఉపేందర్, శివ బ్లడ్ బ్యాంక్ బాధ్యులు నవీన్, వెంకట్, సైదులు పాల్గొన్నారు.