ఖమ్మం

భూగర్భ గనిలోకి కార్బన్‌డయాక్సైడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, జూలై 17: పివికె-5 ఇంక్లైన్ గనిలోకి కార్బన్‌డయాక్సైడ్‌ను పంపించే ప్రక్రియను ఆదివారం అధికారులు ప్రారంభించారు. దీనికి సంబంధించి బోరుబావుల తవ్వకాలు శనివారం ప్రారంభమయ్యాయి. పలుచోట్ల గని ఉపరితలంపై పలుచోట్ల తవ్వకాలు జరపడానికి ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు రెండు బోరుబావుల తవ్వకాలు పూర్తయ్యాయి. ఇందులో ఒకటి మాత్రం ఫలితాన్నిచ్చింది. మరొకటి విజయవంతం కావడానికి సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అనువుగా ఉన్న బోర్‌వెల్ ద్వారా విషవాయువు లీకేజీ శాంపిల్స్ సేకరించి కోల్ టెస్టింగ్ ల్యాబ్‌కు పంపించారు. అదేవెల్ నుండి కార్బన్‌డయాక్సైడ్‌ను గనిలోకి పంపించే ప్రక్రియను అధికారులు చేపట్టారు. ఈప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.