ఖమ్మం

ఆర్టీసి గుర్తింపు సంఘం ఎన్నికలు రేపే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(మామిళ్ళగూడెం), జూలై 17: రాష్ట్రంలోనే అత్యధిక మంది కార్మికులు కలిగి ఉన్న కార్పొరేషన్‌గా గుర్తింపు ఉన్న ఆర్టీసి కార్మిక గుర్తింపు సంఘ ఎన్నికలు రేపు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆదివారం వరకు ఖమ్మం రీజియన్‌లోని అన్ని ఆర్టీసి డిపోల్లో ఆయా సంఘాల నేతలు భారీ ప్రచారం నిర్వహించారు. తమ సంఘాల రాష్ట్ర నేతలు, అనుబంద పార్టీల ముఖ్య నేతలతో డిపోల వద్ద కార్మికులు ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని కోరుతు విస్తృత ప్రచారం నిర్వహించారు. డిపోల వద్ద భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో పాటు కార్మిక సంఘాల నేతలు తమ గుర్తింపు నమూనాలతో డిపోల వద్ద కార్మికులను కలిసి ఓటు వేయాలంటూ ప్రచారం నిర్వహించారుం. ఖమ్మం రీజియన్‌లో ఇయు-ఎస్‌డబ్ల్యూఎఫ్ కూటమి, తెలంగాణ మజ్దూర్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, బికెయులు పోటీలో నిలవడంతో ఇక్కడ ఉత్కంఠ పోటీ నెలకొంది. ఆయా సంఘాలు ఎవ్వరికివారే కార్మికులను ప్రసన్నం చేసుకునేందుకు పోటీ పడుతూ ఆదివారం అర్థ రాత్రి వరకు డిపోల వద్ద విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఖమ్మం రీజియన్‌లో ఆరు డిపోల పరిధిలో 2,844 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఓట్లల్లో 1,423 ఓట్లు వచ్చిన సంఘం రీజియన్‌లో గుర్తింపు సంఘం హోద పొందుతుంది. ఈ ఓట్ల కోసం పోటీలో ఉన్న నాలుగు సంఘాల నేతలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. రాష్ట్ర గుర్తింపు కోసం వేసే క్లాస్-3 ఓటు ఏ సంఘానికి వేసినా పర్వాలేదు, రీజియన్ గుర్తింపు కోసం వేసే క్లాస్-6 ఓటు మాత్రం మాకు వేయండి అంటూ ఆయా సంఘాలు ప్రచారం చేయడం గమనార్హం.