ఖమ్మం

పొంగులేటిపై స్పీకర్‌కు ఫిర్యాదు ...?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జూలై 17: ఖమ్మం లోక్‌సభ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేయనున్నది. గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన ఆయన తర్వాత అధికార టిఆర్‌ఎస్‌లో చేరిన నేపథ్యంలో ఆయనపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేయనున్నది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల సమయంలోనే ఆయనపై ఫిర్యాదు చేయటమే కాకుండా త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌పై వత్తిడి తీసుకరానున్నట్లు తెలిసింది. వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరి కార్యదర్శిగా ఉన్న ఆయన పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా పని చేశారని, పార్టీపై అనవసర ఆరోపణలు చేసి ఇతర పార్టీలో చేరారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలిసింది.
ఇదిలా ఉండగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఫిర్యాదు చేసినా ఫలితం ఉండదని అధికార టిఆర్‌ఎస్ నేతలు చెప్తున్నారు. ఆ పార్టీ తరుపున రాష్ట్రంలో ఏకైక ఎంపిగా ఆయన ఉన్నారని, ఆయన అనర్హత నిబంధనలకు సరిపోరని చెప్పుకొస్తున్నారు. అయితే వైసిపి నేతలు కొందరు మాత్రం పొంగులేటిపై అనర్హత వేటు పడుతుందని, తిరిగి ఎన్నికలు వస్తాయని ప్రచారం చేస్తుండటం విశేషం.