ఖమ్మం

మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖానాపురం హవేలి, జూలై 17: హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి పర్యావరణాన్ని కాపాడాలని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం స్థానిక పెవిలియన్ గ్రౌండ్‌లో హరితహారం కార్యక్రమంలో ఆటోవర్కర్స్‌కు మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని, వీటి ద్వారా భవిష్యత్తు తరాలకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయన్నారు. మొక్కలు నాటి బాధ్యత తీరిపోయిందన్నట్లుగా కాకుండా నాటిన మొక్కను కాపాడాల్సిన బాధ్యత కూడా వారిదేనన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, ఖమ్మం డిఎస్పీ సురేష్‌కుమార్‌లులు మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీసులు హరితహారంపై అవగాహన కల్పించేందుకు తమ వంతుగా బాధ్యత తీసుకొని ఆటో కార్మికులకు మొక్కలను అందించే కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. ఒక్కొక్క ఆటో కార్మికునికి ఐదు మొక్కలను అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ, టిఆర్‌ఎస్ నాయకులు ఆర్జెసి కృష్ణ, కమర్తపు మురళీ, భీరెడ్డి నాగచంద్రారెడ్డి, ట్రాఫిక్ సిఐ నరేష్‌రెడ్డి పాల్గొన్నారు.