ఖమ్మం

అంత్యపుష్కరాలకు ప్రత్యేక ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, జూలై 24: గతంలో ఎన్నడూ లేని విధంగా ఇక గోదావరి అంత్యపుష్కరాలను కూడా వైభవంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈఓ తాళ్లూరి రమేశ్‌బాబు వెల్లడించారు. జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో అంత్యపుష్కరాలను విజయవంతం చేసేందుకు కార్యాచరణను రూపొందిస్తున్నట్లు ఆయన తన చాంబర్‌లో ఆదివారం నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ప్రకటించారు. ఈ నెల 31 నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు ప్రతీ రోజు భక్తులకు సకల సదుపాయాలు కల్పిస్తున్నట్లు వివరించారు. మొదటి రోజున స్వామి వారి ప్రచారమూర్తులను, సుదర్శన పెరుమాళ్లను, రామపాదుకలతో ఊరేగింపుగా 31వ తేదీ ఉదయం 5.30 గంటలకు గోదావరి తీరంలోని పునర్వసు మండపానికి చేరుకుంటామన్నారు. నిత్యం పునర్వసు మండపంతో పాటుగా, గోదావరిలో లాంచీని కూడా పూలతో అలకరిస్తామన్నారు. పుణ్యస్నానాలు చేసుకున్న భక్తులు పునర్వసు మండపంలో స్వామి వారి ప్రచారమూర్తులను దర్శనం చేసుకునే వీలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రతీ రోజు సాయంత్రం గోదావరికి నదీ హారతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. వైదిక కమిటీ సూచనల ప్రకారం 12 రోజుల పాటు భక్తులకు అన్నదానం దేవస్థానం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. భక్తులు వేలాదిగా తరలివచ్చి అంత్యపుష్కరాలను విజయవంతం చేయాలని కోరారు. అన్నిశాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించి భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు రూపొందిస్తామన్నారు. తీరం వెంబడి విద్యుదీపాల అలంకరణ, నదీ స్నానాల వద్ద బట్టలు మార్చుకునే గదులు, పిండప్రదానం చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు ఉంటాయన్నారు. ఈ సమావేశంలో స్థానాచార్యులు స్థలసాయి, ప్రధానార్చకులు రామం తదితరులు పాల్గొన్నారు.
కొబ్బరి, పూల తోటల పెంపకం: ఈఓ
జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో శ్రీ సీతారామచంద్రస్వామికి కొబ్బరి, పూలతోటలను ప్రత్యేకంగా సాగు చేయనున్నట్లుగా ఈఓ తాళ్లూరి రమేశ్‌బాబు వెల్లడించారు. దేవస్థానం భూమిలో ప్రత్యేకంగా వీటిని సాగుచేయడంతో పాటు, గోశాల ద్వారా గోవులను పెంచి అక్కడ పూజలు నిర్వహించి వాటి పాలను రామయ్య అభిషేకానికి, పూలను స్వామి అర్చనకు వినియోగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కెసీఆర్ రామాలయం అభివృద్ధికి రూ.100కోట్లు ప్రకటించారని, వాటికి సంబంధించిన సాంకేతిక పరమైన అన్ని పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. త్వరలో ముఖ్యమంత్రితో పాటుగా శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి వచ్చి మరోమారు ఆలయాన్ని పరిశీలించి ప్రణాళికకు ఆమోదం తెలుపుతారన్నారు.