ఖమ్మం

మల్లన్న సాగర్ నిర్వాసితులపై లాఠీచార్జికి నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముదిగొండ, జూలై 25: మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులపై జరిపిన పోలీసుల కాల్పులు, లాఠీచార్జిని నిరసిస్తూ సోమవారం ముదిగొండలో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. సిఎం డౌన్‌డౌన్ అంటూ పోలీసు జులుం నశించాలని మంత్రి హరీష్‌రావు వెంటనే రాజీనామ చేయాలి అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ముదిగొండ బస్టాండ్ సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి వాసిరెడ్డి వరప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తుందని అన్నారు. అమాయక ప్రజలపై జరిగిన దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల సహాయ కార్యదర్శి బంకా మల్లయ్య, డివిజన్ కమిటీ సభ్యులు బట్టు పురుషోత్తం, టిఎస్ కళ్యాణ్, ప్రభావతి, కందుల భాస్కర్‌రావు, వేల్పుల భద్రయ్య, మందపువెంకన్న, కోటిరెడ్డి, పయ్యావుల పుల్లయ్య పాల్గొన్నారు.
ఎర్రుపాలెంలో...
ఎర్రుపాలెం: మెదక్ జిల్లా మల్లన్నసాగర్ ముంపుగ్రామాల ప్రజలు చేస్తున్న ధర్నాకు సంఘీభావంగా వెళ్ళిన నాయకులు, రైతులపై జరిగిన లాఠీచార్జికి నిరసనగా సోమవారం ఎర్రుపాలెం అంబేద్కర్ సెంటర్‌లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సిఎం కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్ధంచేసి నిరసన తెలిపారు. సిపిఎం మండల పార్టీ కార్యదర్శి దివ్వెల వీరయ్య ఆధ్వర్యంలో కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లన్నసాగర్‌లో భూములు కోల్పోతున్న రైతులకు 2013్భసేకరణ చట్టాన్ని అమలు చేయాలన్నారు. భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా ప్రభుత్వం మొండి వైఖరితో రైతుల నుండి భూములు లాక్కునే ప్రయత్నాలు చేస్తుందని, దానిని అక్కడి రైతులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు వ్యతిరేకించడంతో ప్రభుత్వం పోలీసుల సహాయంతో రైతులపై లాఠీచార్జి, కాల్పులు జరిపించడం అమానుషమన్నారు. కార్యక్రమంలో సంజీవరావు, కోటేశ్వరరావు, ఆర్ నాగేశ్వరరావు, జోగయ్య, రామకృష్ణ తదితరులున్నారు.
జూలూరుపాడులో...
జూలూరుపాడు: మెదక్ జిల్లా పల్లెపహాడ్ ప్రాంతంలోని మల్లన్నసాగర్ ముంపు బాధితులపై పోలీసుల దాడిని నిరసిస్తూ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై పాపకొల్లు క్రాస్ రోడ్డు వద్ద సోమవారం దిష్ఠిబొమ్మను దగ్ధం చేసి సిపిఎం పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా రైతు సంఘం వైరా డివిజన్ అధ్యక్షులు బానోతు ధర్మా మాట్లాడుతూ మల్లన్నసాగర్ భూనిర్వాసితులు న్యాయమైన పోరాటానికి అన్ని వర్గాల ప్రజల మద్దతు తెలపాలని కోరారు. తమకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ శాంతియుత కార్యక్రమాన్ని చేపడుతున్న మల్లన్నసాగర్ భూనిర్వాసితులపై ప్రభుత్వం దాడులు చేయించటాన్ని ఖండిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది పథకాల విషయంలో భూములను కోల్పోయే పేదల కుటుంబ జీవనాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రత్యేక ప్యాకేజీలను ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో సంఘం మండల ఆధ్యక్షులు ఊడల వెంకటేశ్వర్లు, నాయకులు మండ్రాజుల కృష్ణయ్య, యాసా నరేష్, వెంకటేశ్వర్లు, బలరాం, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
గార్లలో...
గార్ల: పరిహారంపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆందోళన నిర్వహిస్తున్న మల్లన్న సాగర్ భూనిర్వాసితులపై పోలీసులు లాఠీచార్జీ చెయ్యడాన్ని నిరసిస్తూ న్యూడెమోక్రసీ, సిపిఎం అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘం కార్యకర్తలు సోమవారం గార్లలో వేర్వేరుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. న్యూడెమోక్రసీ గార్ల చెపల మార్కెట్ సెంటరులో ముఖ్యమంత్రి కెసిఅర్ దిష్టిబొమ్మను దగ్ధం చెయ్యగా నెహ్రూ సెంటరులో వ్యవసాయ కార్మిక సంఘం రాస్తారోకో నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా హక్కులను కాలరాస్తూ నియంతృత్వ చర్యలకు పాల్పడుతుందని, మల్లన్న సాగర్ భూనిర్వాసితులకు కోరుకున్న పరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి జడ సత్యనారాయణ, నాయకులు సక్రు, ఇర్రి రవి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కె శ్రీనివాస్, రాజారావు, గిరిప్రసాద్ పాల్గొన్నారు.
కారేపల్లిలో...
కారేపల్లి: పరిహారం కోసం ఎదురు చూస్తున్న మల్లన్న సాగర్ భూనిర్వాసితులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన దాడులు అమానుషమని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వేదగిరి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని స్థానికి బస్టాండ్ సెంటర్‌లో మల్లన్న సాగర్ ఘటనను నిరసిస్తూ వ్యకాస ఆధ్వర్యంలో ఘటనకు కారణమైన తెలంగాణ రాష్ట్ర భారీనీటి పారుదల శాఖా మంత్రి టి హరీష్‌రావు దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ భూనిర్వాసితులకు పరిహారం చెల్లించేందుకు 2013 లోనే కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకువచ్చిందని, ఆ చట్టం అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తుందన్నారు. భూములు కోల్పొయిన నిర్వాసితులు తమకు అన్యాయం జరిగిందని గొంతెత్తినందుకు రాష్ట్ర ప్రభుత్వం లాఠీచార్జ్ చేయించడం హేయమైన చర్య అన్నారు. మల్లన్న సాగర్ ఘటనకు నైతిక భాధ్యత వహిస్తూ మంత్రి హరీష్‌రావు క్షమాపణ చెప్పి, పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కొండబోయిన నాగేశ్వరరావు, సిఐటియు వైరా డివిజన్ నాయకులు కె నరేందర్, నాయకులు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
చింతకానిలో...
చింతకాని: మల్లన్న సాగర్ భూనిర్వాసితులపై పోలీసులు లాఠిచార్జ్ చేయడం అమానుషమని సిపిఎం మండల కార్యదర్శి మడుపల్లి గోపాలరావు అన్నారు. నిర్వాసితులపై దాడిని నిరసిస్తు సోమవారం పండల కేంద్రం చింతకాని బస్టాండ్ సెంటర్‌లో సిపియం మండల కమిటి ఆద్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా గోపాలరావు మాట్లాడుతూ రైతులు, నిర్వాసితుల పట్ల ప్రభుత్వం నిర్లక్షంగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాసితులకు న్యాయం జరిగేంతవరకు సిపియం అండగా నిలబడుతుదన్నారు. ప్రభుత్వ నిరంకుశత్వాన్ని ఎండగడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వత్సవాయి జానకిరాములు, బత్తుల శ్యామ్‌సుందర్, గడ్డం రమణ, గడ్డం ఆదినారాయణ, బండి చిన్నవీరయ్య, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.