ఖమ్మం

మొక్కల సంరక్షణ బాధ్యత తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముదిగొండ, జూలై 25: హరితహారంలో నాటిన మొక్కలు ఎండిపోకుండా వాటిని సంరక్షించటంలో అధికారులు బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ లోకేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ముదిగొండ మండలంలోని వెంకటాపురం, గంధసిరి గ్రామాల్లో ఆయన సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా వెంకటాపురంలో వన నర్సరీ, గంధసిరిలోని మరుగుదొడ్ల నిర్మాణం, ఇంకుడు గుంతల నిర్మాణం, రహదారుల వెంట నాటిన మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లోకేష్‌కుమార్ అధికారులతో మాట్లాడుతూ మండలంలో ఎన్ని మొక్కలు నాటారు? ఎన్ని ఇప్పటి వరకు బతికి ఉన్నాయి? అని అడిగి తెలుసుకున్నారు. మొక్కలు ఎండిపోకుండా అవసరమైతే వాటర్ ట్యాంకుల ద్వారా నీటిని తెప్పించి మొక్కలను సంరక్షించాలన్నారు. వివిధ శాఖల అధికారులు ఆయా శాఖల ద్వారా మొక్కలు నాటాలన్నారు. గంధసిరిలో ఇంటింటికి తిరిగి మరుగుదొడ్ల నిర్మాణాన్ని, ఇంకుడు గుంతల నిర్మాణాన్ని పరిశీలించారు. మరుగుదొడ్లు నిర్మించుకోకపోతే ప్రభుత్వ పథకాలు ఆగిపోతాయని లభ్ధిదారులకు తెలియజేశారు. మరుగుదొడ్ల ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. గంధసిరి గ్రామ పంచాయతీ నిధులు ప్రజల అవసరాలకు ఉపయోగపడేలా ఖర్చు చేయాలని గ్రామ పంచాయతీ పాలక వర్గానికి, పంచాయతీ సిబ్బందికి తెలియజేశారు. ప్రస్తుతం ఉన్న ఇళ్ళు శిధిలావస్థకు చేరుకున్నాయని గంధసిరి ఎంపిటిసి మర్రి గాలెమ్మ కలెక్టర్ దృష్టికి తీసుకవెళ్ళారు. ప్రపోజల్స్ వచ్చినప్పుడు పరిశీలిస్థామని కలెక్టర్ తెలిపారు.
అధికారుల పనితీరుపై ఆగ్రహం
మండలంలోని వెంకటాపురం వననర్సరీని పరిశీలించిన కలెక్టర్ అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని మొక్కలు నాటాలని లక్ష్యం నిర్ధేశించారు? మీరు ఎన్ని మొక్కలు నాటారు. జిల్లాలో ఎక్కడ కూడా వననర్సరీల్లో మొక్కలు మిగల్లేదు. కానీ మీ నర్సరీలో ఎందుకు మిగాలాయి అంటూ కలెక్టర్ ప్రశ్నించారు. వెంటనే మొక్కలను రహదారుల వెంట, ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో నాటాలని మిగిలిన వాటిని వేరే మండలాలకు తరలించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహశీల్ధార్ రమాదేవి, ఎంపిడిఓ నర్మద, ఏపిఓ అజయ్‌కుమార్, సర్పంచ్ ఉరిమళ్ళ అరవింద, ఫారెస్ట్ అధికారి కవిత, ఆర్‌ఐ భాస్కర్, పంచాయతీ కార్యదర్శులు సంపత్, నెల్లూరి మణిపాల్గొన్నారు.
నెలఖరులోగా
3లక్షల 40వేల మొక్కలు నాటాలి
నేలకొండపల్లి: ఈ నెలఖరులోగ నేలకొండపల్లి మండలంలో 3లక్షల 40వేల మొక్కలను నాటే లక్ష్యాన్ని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ మండల అధికారులను ఆధేశించారు. ఈమొక్కలు నాటే కార్యక్రమంలో వ్యవనాయశాఖ అధికారులకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలని ఆయన చెప్పారు. సొమవారం మండల పరిధిలోని ఆరెగూడెం, ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నందు ప్రభుత్వ నర్సరీలను ఆయన పరిశీలించారు. వాటిలో ఏఏ మొక్కలు ఉన్నాయని, ఏమేరకు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఎన్‌ఎస్‌పి కాలువ లైనింగ్ పనులు పూర్తి అయినందున వలన బ్లాక్ ప్లాంటేషన్‌గా చేపట్టాలని చెప్పారు. ఆరెగూడెం ప్రభుత్వ పాఠశాల సమస్యలను పరిష్కరించాలని ఆగ్రామ సర్పంచ్ కొమ్మినేని కృష్ణయ్య కలెక్టర్‌కు విన్నవించుకోగా దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు.