ఖమ్మం

భట్టి అరెస్టుకు నిరసనగా రాస్తారోకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(ఖిల్లా), జూలై 26: మెదక్ జిల్లా మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అయితం సత్యంతో సహా పలువురు కాంగ్రెస్ నేతలను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం బస్టాండ్ సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు రాస్తారోకో చేస్తున్న నిరసనకారులను అరెస్టు చేసి స్థానిక వన్‌టౌన్‌కు తరలించారు. ఈ రాస్తారోకోలో కార్పొరేటర్లు వడ్డెబోయిన నర్సింహరావు, బాలగంగాధర్‌తిలక్, నాయకులు జహీర్‌అలీ, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బండి మణి, రాధాకృష్ణ, సంతోష్, ఫరీద్, వెంకన్న, సీతామహాలక్ష్మి, భవాని తదితరులు పాల్గొన్నారు.

యువజన కాంగ్రెస్ ఆధ్యర్వంలో ...
నేలకొండపల్లి: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ నాయకుల అక్రమ అరెస్ట్‌లను నిరసిస్తూ నేలకొండపల్లిలోని పొట్టిశ్రీరాముల సెంటర్‌లో యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు సరైన న్యాయం చేయకుండా వారిపై లాఠిచార్జ్ చేయడాన్ని నిరసిస్తూ టిపిసిసి నాయకులు తలపేట్టిన పాదయాత్రను అడ్డుకొని, వారిని అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ పాలేరు డివిజన్ అధ్యక్షుడు బొడ్డు బొందయ్య మాటాడుతూ ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయకుండా వారిపై హింసాత్మకంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. రైతులపై, మహిళలపై పోలీసులు లాఠీచార్జ్ చేయించడం అమానుషమన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అహంకారానికి ఇది నిదర్శనమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్వాసితులకు సరైన నష్టపరిహరం అందించాలని అన్నారు. ఈ ధర్నా రాస్తారోకో వల్ల వాహనలు నిలిచిపోయాయి. ఈ ధర్నాలో యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జేర్రిపోతుల అంజని సాయి, నకిరికంటి అనే్వష్, హనుమంతరావు, చిర్ర ముక్కంటి, శంకర్, పుల్లయ్య, పరశురామ్, వినిత్ తదితరులు పాల్గొన్నారు.
భట్టి అరెస్ట్ అప్రజాస్వామికం
ముదిగొండ: మల్లన్న సాగర్ ప్రాజెక్టు భూ నిర్వసితులకు మద్దతు తెలిపెందుకు వెళ్తున్న టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్కను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని ముదిగొండ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొమ్మినేని రమేష్‌బాబు ఎంపిపి పసుపులేటి లక్ష్మిలు అన్నారు. హైద్రాబాద్ నుండి మెదక్ వెళ్తున్న భట్టి విక్రమార్కను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ముదిగొండ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ముదిగొండ బస్టాండ్ సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలనను కొనసాగిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముదిగొండ, వల్లభి, వెంకటాపురం సర్పంచ్‌లు ఉసికల సుధారాణి, భిచ్చాల భిక్షం, ఉరిమళ్ళ అరవింద, మాజి జడ్పిటిసి పసుపులేటి దేవేంద్రం, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గుడిపుడి ఝాన్సీ, యడవల్లి ఎంపిటిసి కందిమళ్ళ వీరబాబు, మండల నాయకులు మందరపు ఉపేందర్, సామినేని శంభయ్య, బుచ్చిరామయ్య లు పాల్గొన్నారు.