ఖమ్మం

ఆశా కార్యకర్తలను ప్రోత్సహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తుపల్లి, జూలై 28 : సమాజంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఆశాకార్యకర్తలు అందిస్తున్న సేవలను ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలని సత్తుపల్లి క్లస్టర్ ఆఫీసర్ డాక్టర్ ఎల్.్భస్కర్‌నాయక్ అన్నారు. సత్తుపల్లిలోని శ్రీలక్ష్మీప్రసన్న ఫంక్షన్‌హాల్‌లో సత్తుపల్లి, వేంసూరు, దమ్మపేట మండలాల స్థాయిలో గురువారం క్లస్టర్ ఆఫీర్ డాక్టర్ ఎల్. భాస్కర్‌నాయక్ అధ్యక్షతన ఆశా సమ్మేళనం ఘనంగా జరిగింది.సత్తుపల్లి నగరపంచాయతీ చైర్మన్ దొడ్డాకుల స్వాతి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజం కోసం కేవలం పారితోషికంతోనే పనిచేస్తున్న ఆశా కార్యకర్తల సేవలు అభినందనీయమని సామాజిక సేవాభావంతో ప్రజలను ఆరోగ్యవంతులుగా ఆశా కార్యకర్తలు చైతన్యవంతులను చేయటంలో కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. ఎంపీపీ జ్యేష్ట అప్పారావు మాట్లాడుతూ నాటి ధన్వంతరి అందించిన సేవలనే నారాయణుణి అంశగా ఆశాలు సేవలందిస్తున్నారని కొనియాడారు.
మాతాశిశు మరణాలు అరికట్టడంలో వీరి శ్రమ, శక్తి అమూల్యమైందని ప్రశంసించారు. ముందుగా కొవ్వొత్తులు వెలిగించి ఆశా ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. అనంతరం ఆరోగ్య సంబంధ అంశాలపై వివిధ పోటీలు నిర్వహించారు. ఉత్తమ సేవలు అందించిన ఆశా కార్యకర్తలు, పోటీలలో విజేతలకు అతిధులు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు ప్రేమలత, నాగు,సీహెచ్ వెంకటేశ్వర్లు, సూపర్‌వైజర్లు అన్నమ్మ, రత్తమ్మ, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
విఎం బంజరలో...
పెనుబల్లి: పెనుబల్లి, చండ్రుగొండ, కల్లూరు మండలాల పరిధిలో గల నాలుగు క్లష్టర్ల ఆశావర్కర్ల సమ్మేళనాన్ని గురువారం విఎం బంజరలో సప్తపది కల్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిపి చీకటి బేబి శకుంతల మాట్లాడుతూ మారుమూల గ్రామాలలో సైతం ఆశావర్కర్లు చేస్తున్న వైద్యసేవలు ప్రశంసనీయమని కొనియాడారు. సీజనల్ వ్యాధుల పట్ల గర్భిణీల ఆరోగ్యాల పట్ల ఆశావర్కర్లు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ సంబంధిత నివేదికలను వైద్యసిబ్బంది దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సీజన్‌లో దోమలు అధికంగా ఉండి వీటివల్ల ప్రజలకు మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు సోకే ప్రమాదముందని, గ్రామాలలో తిరుగుతూ వీటి నివారణకు వైద్యసేవలు అందించాలన్నారు. ఈ సమ్మేళనంలో ఆశావర్కర్లకు సాంస్కృతిక పోటీలతో పాటు ఆటల పోటీలను నిర్వహించారు. లంకాసాగర్, యర్రగుంట, చండ్రుగొండ, కల్లూరు పిహెచ్‌సిల పరిధిలో కె రమణ, ఎస్‌కె ముంతాజ్, డి పుష్పలత, కె సామిత్రిలను ఉత్తమ ఆశావర్కర్లుగా అధికారులు ఎంపిక చేశారు. ఈ సమ్మేళనంలో ఎన్‌ఆర్‌హెచ్‌ఎం జిల్లా ప్రోగ్రామ్ అధికారిణి కళావతిబాయి, వైస్ ఎంపిపి చెక్కిరాల లక్ష్మణరావు, డిపిహెచ్‌ఎన్ అన్నామేరి, శాంతారాణి, పద్మజారాణి, సృజన, వెంకటేశ్వర్లు, సర్పంచ్ కృష్ణవేణి, సువర్ణ, కోలమ్మ, భాస్కర్‌నాయక్ పాల్గొన్నారు.