ఖమ్మం

భక్తులకు సకల ఏర్పాట్లు: పీవో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, జూలై 29: ఈనెల 31 నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు జరిగే గోదావరి అంత్య పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఐటిడిఎ పీవో, ఇంఛార్జ్ సబ్‌కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు. ఐటీడీఏలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ముద్రించిన అంత్య పుష్కరాలు-2016 శుభ ఆహ్వాన గోడ పత్రికలను శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వరదల వల్ల గోదావరి వద్ద పుష్కరఘాట్లపై పేరుకుపోయిన ఒండ్రుమట్టిని తొలగించి భక్తులు స్నానాలు ఆచరించేందుకు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు గోదావరి లోతుకు వెళ్లి స్నానాలు చేయకుండా ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు, అలాగే నీటి పారుదల, అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లను, రిస్య్వూ టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు పీవో తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చేందుకు బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, దొంగతనాలు జరగకుండా పోలీసుశాఖ ఆధ్వర్యంలో 24 గంటలు భక్తులు బస చేసే ప్రాంతాల్లో, ముఖ్య కూడళ్లలో గట్టి నిఘాను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో టి.రమేష్‌బాబు, తహసిల్దార్ రామకృష్ణ, ఆర్‌టీసీ డిఎం నరసింహం, దేవస్థానం డిప్యూటీ ఈఈ రవీందర్, ప్రధాన అర్చకులు సీతారామానుజాచార్యులు పాల్గొన్నారు.