ఖమ్మం

మొక్కల పెంపకంతో పర్యావరణ పరిరక్షణ : ఎంపి పొంగులేటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముదిగొండ, జూలై 31: గ్రామాల్లో, పొలాల గట్లపై, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలను విరివిగా నాటడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండలంలో పలు గ్రామాల్లో పర్యటించిన ఎంపి హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మొక్కల పెంపకం మంచి నిర్ణయం అని, ఈ కార్యక్రమంలో అందరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలను కాపాడాలంటే ఇప్పుడు మనం మొక్కలు నాటాలని సూచించారు. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులను సరిదిద్దాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఇందుకోసం మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్‌ఐ తాటిపాముల కరుణాకర్, పోట్ల ప్రసాద్, అటవీశాఖ అధికారి ప్రసాద్, కవిత, శ్రీనివాస్ యాదవ్, ఎఇ వెంకట్రామిరెడ్డి, రమేష్, ఇవోఆర్డీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.