ఖమ్మం

ఎంసెట్-2 లీకేజిపై సిబిఐతో విచారణ జరిపించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(మామిళ్ళగూడెం), జూలై 31: ఎంసెట్-2 లీకేజిపై బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ, వైద్య శాఖ మంత్రులు రాజీనామా చేయాలని, కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై సిబిఐతో విచారణ జరిపించాలని తెలుగునాడు విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు దుద్దుకూరి సుమంత్ డిమాండ్ చేశారు. ఆదివారం ఎంసెట్ లీకేజిపై సమగ్ర విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సంఘ కార్యాలయం నుంచి సైకిల్ ర్యాలీతో జడ్పిసెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నల్లరిబ్బన్‌లను నోటికి కట్టుకొని దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎంసెట్ పేపర్ లీకేజి జరగడం అవమానకరమన్నారు. ఈ లీకేజితో రాష్ట్రంలో విద్యావ్యవస్థలోని లోపాలను బహిర్గతం చేస్తున్నాయన్నారు. అసలు దోషులను గుర్తించేందుకు సిఐడి విచారణతో పాటు కేంద్ర సిబిఐ విచారణ జరిపించాలన్నారు. ఈ లీకేజి వ్యవహారంలో 100 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. కీలకమైన పోటీ పరీక్షల్లో ప్రభుత్వ నిర్లక్ష్యంతో లక్షల మంది విద్యార్థుల జీవితాలు నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ స్వార్థం కోసం ప్రభుత్వం నేడు విద్యార్థుల జీవితాలను బలిచేసిందన్నారు. మధ్యవర్తులతో పాటు అసలు దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో చాగంటి శ్రీకాంత్, భూక్యా అశోక్, అభిరామ్, గోపి, పృధ్వీ, బ్రహ్మం, చైతన్య, శ్రావణ్, నరేష్ పాల్గొన్నారు.