ఖమ్మం

సెప్టెంబర్ 2న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం (క్రైం),జూలై 31: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 2న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు మద్దతు ఇస్తున్నామని తెలంగాణ టిఎన్‌జివోస్ కేంద్ర సంఘం గౌరవాధ్యక్షుడు దేవిప్రసాద్ తెలిపారు. ఆదివారం స్థానిక టిటిడిసి భవన్‌లో జరిగిన టిఎన్‌జివోస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సిపియస్ విధానాన్ని రద్దు చేయాలని, రాష్ట్ర విభజనలో కమల్‌నాథ్ కమిటీ లోప భూయిష్టమైన మార్గదర్శకాలను అమలు చేయడం వల్ల ఉద్యోగులకు నష్టం జరిగిందన్నారు. ఆంధ్రాకు కేటాయించిన తెలంగాణ ఉద్యోగులను తిరిగి తెలంగాణకు రప్పించాలని, దీనిపై సిఎం కెసిఆర్ తీసుకునే నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగాఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేయాలని, పిఆర్‌సి ఇస్తామని ప్రకటించిన సిఎం కెసిఆర్ నేటికీ నిధులు కేటాయించకపోవడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. వెంటనే వాటిని విడుదల చేయాలని కోరారు. ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులపై కుట్ర పూరితంగా వారిపై మానసిక ఒత్తిళ్లకు గురి చేస్తున్నారని, ఈ క్రమంలోనే ప్రభాకర్ అనే ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందాడని విచారం వ్యక్తం చేశారు. ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లాలో ఉద్యోగులు, ఇంజనీర్లపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉద్యోగులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సెప్టెంబర్ 2 వరకు అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేసేందుకు ఉద్యోగ సంఘాలను సన్నదం చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఉద్యోగులకు తలనొప్పిగా మారిన సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గత మార్చిలో పిఆర్‌సిని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం నేటికీ అమలు చేయకపోవడంతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నూతన పించన్ విధనాన్ని రద్దు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారంలో 40 లక్షల మొక్కలు నాటాలని తీర్మానం చేసినట్టు తెలిపారు. నగదు రహిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం రెండు సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ కనీసం హెల్త్‌కార్డులు కూడా జారీ చేయలేదని విమర్శించారు. దసరా పండుగ నాటికి పిఆర్‌సి బకాయిలు చెల్లించాలని కోరారు. టిఎన్‌జివోస్ రాష్ట్ర ప్రెసిడెంట్ కారం రవిందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈసమావేశంలో ప్రధానకార్యదర్శి ఎంఏ హమీద్, సహాయ అధ్యక్షుడు రాజేందర్, కోశాధికారి వేణుగోపాల్, మహిళా అధ్యక్షురాలు బి రేచల్, జిల్లా అధ్యక్షుడు కూరపాటి రంగరాజు, అశోక్, శ్రీనివాస్‌రెడ్డి, జగదీశ్వర్, కార్యదర్శులు రామయ్య, శ్యాంరావు, నాయకులు ఉపేందర్‌రెడ్డి, శైలజాదేవి, భూపాల్‌రెడ్డి, ప్రసాద్ పాల్గొన్నారు.